బుధవారం 03 జూన్ 2020
International - Apr 02, 2020 , 15:22:37

ఎలుగుబంటి పైత్య‌ర‌సం తాగితే..

ఎలుగుబంటి పైత్య‌ర‌సం తాగితే..

హైద‌రాబాద్‌: చైనాలో సాంప్ర‌దాయ వైద్య చికిత్స‌ల‌కు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అయితే తాజాగా ఆ దేశ ప్ర‌భుత్వం ఓ కొత్త ఆదేశం జారీ చేసింది.  క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న కోవిడ్‌19 పేషెంట్ల‌కు ఎలుగుబంటి పైత్య‌ర‌సాన్ని కూడా ఇవ్వ‌వ‌చ్చు అని పేర్కొన్న‌ది. వైర‌స్ సోకిన పేషెంట్ల‌కు టాన్ రీ కింగ్ ఇంజెక్ష‌న్ ఇవ్వ‌వ‌చ్చు అని ఆ దేశ జాతీయ హెల్త్ క‌మిష‌న్ ప్ర‌తిపాద‌న చేసింది.  అయితే టాన్ రీ కింగ్ ఇంజెక్ష‌న్‌లో ఎలుగుబంటి పైత్య‌ర‌సంతో పాటు మేక కొమ్ముల ర‌సం, మ‌రికొన్ని మూలిక‌ల ర‌సం క‌ల‌గిలిపి ఉంటుంది. 

నిజానికి ఈ పురాత‌న మిశ్ర‌మ ప్ర‌క్రియ‌కు మెడిసిన‌ల్ వాల్యూ ఉన్న‌ట్లు ఎక్క‌డా ఆధారాలు లేవు. కానీ ప్ర‌భుత్వం మాత్రం ఎలుగుబంటి పైత్య‌ర‌సానికి ప‌చ్చ‌జెండా ఊపిన‌ట్లు తెలుస్తోంది.ఎలుగుబంటి కాలేయంలో ఉత్ప‌త్తి అయ్యే పైత్య‌ర‌సాన్ని.. చైనీయులు కొన్ని వంద‌ల ఏళ్ల నుంచి సాంప్ర‌దాయ చికిత్స‌ల్లో వాడుతున్నారు. ఆ ర‌సానికి అంత‌ర్జాతీయ మార్కెట్లోనూ భారీ డిమాండ్ ఉన్న‌ది. ఎలుగుబంటి పైత్య‌ర‌సానికి అనుమ‌తి ఇవ్వ‌డంతో.. జంతు హ‌క్కుల నేత‌లు గ‌గ్గోలుమొద‌లుపెట్టారు. అంతేకాదు ఆ దేశం కొన్నిర‌కాల జంతువుల‌ మాంస విక్ర‌యాల‌ను కూడా ఇటీవ‌లే నిలిపివేసింది.  ఈ నేపథ్యంలో ఈ కొత్త ఆదేశం కొంత అయోమ‌యం సృష్టించ‌నున్న‌ది.
logo