శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 23, 2020 , 18:57:16

డబ్ల్యూహెచ్‌వోకు చైనా రూ. 200 కోట్ల విరాళం

డబ్ల్యూహెచ్‌వోకు చైనా రూ. 200 కోట్ల విరాళం

హైదరాబాద్: కరోనా కల్లోలం మధ్యలో అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు నిధులు నిలిపవేయగా అదనంగా 3 కోట్ల డాలర్లు విరాళంగా ఇచ్చేందుకు చైనా ముందుకు వచ్చింది. కరోనాను ఎదుర్కోవడంలో డబ్ల్యూహెచ్‌వో తప్పడుగులు వేసిందని, చైనా పట్ల పక్షపాత ధోరణి చూపుతున్నదని ఆరోపిస్తూ అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  అమెరికా వాటా సుమారు 40 కోట్ల డాలర్లు (సుమారు రూ. 3 వేల కోట్లు) ఇవ్వకుండా ఆపేశారు. ఈ చర్యను అమెరికాలోని బిల్ గేట్స్ వంటి దాతలు తీవ్రంగా విమర్శించారు. వర్ధమాన దేశాల్లో ఈ చర్య వల్ల ప్రతికూల కోరనా వ్యతిరేక పోరాటం కుంటుపడుతుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా ఇదివరకు ఇచ్చిన 2 కోట్ల డాలర్లతోపాటుగా ఇప్పుడు అదనంగా మరో 3 కోట్ల డాలర్లు (సుమారు రూ.200 కోట్లు) విరాళంగా ఇచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి అండదండలు అందించే ఉద్దేశంతో ఈ విరాళం ఇస్తున్నామని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ మీడియాకు చెప్పారు.  చైనా ప్రభుత్వానికి, ప్రజలకు డబ్ల్యూహెచ్‌వోపై గల నమ్మకానికి, మద్దతుకు నిదర్శనమని ఆయన అన్నారు.


logo