భారత్ సరిహద్దులో పాక్ డ్రిల్ : యుద్ధ విమానాలు పంపిన చైనా

బీజింగ్ : భారత సరిహద్దుకు సమీపంలో ఉన్న బేస్‌లో పాకిస్తాన్ సైనిక విన్యాసాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ ద్వైపాక్షిక సైనిక విన్యాసంలో పాల్గొనేందుకు చైనా తన యుద్ధ విమానాలను, దళాలను పంపినట్లు చైనా సైన్యం సోమవారం ప్రకటించింది. పాకిస్తాన్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్ బేస్ గుజరాత్ సరిహద్దుకు దగ్గరగా ఉన్నది. వైమానిక దళం డ్రిల్ వాస్తవ పోరాట శిక్షణను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తున్నది.
"చైనా-పాకిస్తాన్ ఉమ్మడి వైమానిక దళం వ్యాయామం షాహీన్ (ఈగిల్) - IX స అని పేర్కొంటూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేదు. అలాగే ఎప్పుడు ముగుస్తుందో కూడా స్పష్టంగా చెప్పకుండా డిసెంబర్ చివరలో విన్యాసాలు ముగుస్తాయని మాత్రమే ప్రకటనలో పేర్కొన్నారు. తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వెంట కొనసాగుతున్న భారత్-చైనా సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో తాజా విన్యాసాలు జరుగుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. "ఇది చైనా-పాకిస్తాన్ మిలిటరీ సంబంధాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. రెండు వైమానిక దళాల మధ్య ఆచరణాత్మక సహకారాన్ని మరింత పెంచుతుంది. అలాగే ఇరుపక్షాల వాస్తవ-పోరాట శిక్షణ స్థాయిని మెరుగుపరుస్తుంది" అని ప్రకటన తెలిపింది. 2019 సెప్టెంబర్ నెలలో చైనా యొక్క జిన్జియాంగ్ ప్రాంతంలో జరిగిన షాహీన్ డ్రిల్ చివరి ఎడిషన్, రెండు దేశాల నుండి దాదాపు 50 యుద్ధ విమానాలు పాల్గొన్న అతిపెద్దది.
“# చైనా ఎయిర్‌ఫోర్స్ వై 20 హెవీ లిఫ్ట్ విమానం భోలారి ఎయిర్‌బేస్ సమీపంలో పాకిస్తాన్లోకి దిగుతున్నట్లు గుర్తించబడింది. దానితో పాటు మరో గుర్తుతెలియని విమానం అదే మార్గాన్ని అనుసరించి ప్రయాణించడం ఉమ్మడి వ్యాయామానికి మద్దతుగా అనుమానిస్తున్నారు” అని శాటిలైట్ ఇమేజరీ నిపుణుడు ట్విట్టర్ హ్యాండిల్ @ detresfa సోమవారం సాయంత్రం ట్వీట్ చేశారు. పాకిస్తాన్ వైమానిక దళం యొక్క భోలారి వైమానిక స్థావరాన్ని 2017 డిసెంబర్లో ప్రారంభించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- వ్యాక్సినేషన్ సక్సెస్
- ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
- వృద్ధుడి చేరదీత..
- వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకోవాలి
- మార్చిలో వచ్చింది.. మార్చిలోనే పోతుంది..
- దేశం గర్వించదగిన రోజు
- రికవరీ రేటు 97.99 శాతం
- చిన్నపాటి సైడ్ఎఫెక్ట్స్ సహజం
- కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
- గ్రామీణ క్రీడలకు తెలంగాణ సర్కారు ప్రోత్సాహం: జడ్పీటీసీ