మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Jul 08, 2020 , 19:53:27

హాంకాంగ్ హోటల్‌ను జాతీయ భద్రతా కార్యాలయంగా మార్చిన చైనా

హాంకాంగ్ హోటల్‌ను జాతీయ భద్రతా కార్యాలయంగా మార్చిన చైనా

హాంకాంగ్: చైనా తన కొత్త జాతీయ భద్రతా కార్యాలయాన్ని హాంకాంగ్‌లో బుధవారం ప్రారంభించింది. కాజ్‌వే బేలోని ఒక హోటల్‌ను తన కొత్త ప్రధాన కార్యాలయంగా మార్చుకొన్నది. స్థానిక న్యాయస్థానాలు, ఇతర సంస్థల పరిశీలనలను ఈ కార్యాలయం నుంచే జరుపనున్నారు. గత వారం నగరంలో బీజింగ్ విధించిన జాతీయ భద్రతా చట్టాన్ని హాంకాంగ్ ప్రభుత్వం అమలు చేయడాన్ని చైనా ప్రభుత్వం ఈ హోటల్ కార్యాలయం నుంచే పర్యవేక్షిస్తుంది.

కమ్యూనిస్ట్ పార్టీ నియంత్రణలో ఉన్న కోర్టుల్లో విచారణ కోసం సరిహద్దు మీదుగా అనుమానితులను తీసుకెళ్లడానికి కొత్త చట్టం అనుమతిస్తుంది. హాంగ్ కాంగ్ అధికారులు వారిని శోధించడంగానీ, అదుపులోకి తీసుకోవడంగానీ చేయలేరు. వారి వాహనాలను కూడా తనిఖీ చేయలేరు. విక్టోరియా పార్కు సమీపంలో ఉన్న కాజ్‌వే బే లో  ఉన్న ఈ భవంన 33 అంతస్తులతో 266 గదులు కలిగి ఉన్నది. ఈ భవనలో ఇదివరకు మెట్రోపార్క్ హోటల్‌ నిర్వహించేవారు. ప్రారంభోత్సవంలో భద్రతా కార్యాలయ చీఫ్ జెంగ్ యాన్క్సియాంగ్ పాల్గొన్నారు. ఏ వ్యక్తి లేదా సంస్థ యొక్క చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను ఉల్లంఘించకుండా చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పారు. 


logo