e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News 28 గంట‌ల్లో 10 అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణం.. వీడియో

28 గంట‌ల్లో 10 అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణం.. వీడియో

28 గంట‌ల్లో 10 అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణం.. వీడియో

బీజింగ్‌: సాధార‌ణంగా ఓ చిన్న ఇళ్లు నిర్మాణానికే నెల నుంచి రెండు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. అదే 10 అంత‌స్తుల భ‌వనాన్ని నిర్మించాలంటే మాత్రం క‌చ్చితంగా ఆరు నెల‌ల నుంచి ఏడాదికిపైగా స‌మ‌యం అవ‌స‌ర‌మ‌వుతుంది. అలాంటిది చైనాలోని ఓ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీ మాత్రం 10 అంతస్తుల భ‌వ‌న‌ నిర్మాణాన్ని కేవలం 28 గంటల వ్యవధిలో పూర్తి చేసింది. అలాగ‌ని అదేదో సినిమా సెట్టు లాంటి నిర్మాణం అనుకుంటే పొర‌పాటే. మనుషులకు నివాస‌యోగ్య‌మైన అపార్ట్‌మెంటు.

వివ‌రాల్లోకి వెళ్తే.. చైనాలోని చాంగ్షాకు చెందిన బ్రాడ్‌ గ్రూప్‌ కంపెనీ ఈ రికార్డు నిర్మాణాన్ని పూర్తిచేసింది. ఈ పది అంతస్తుల బిల్డింగ్‌ నిర్మాణం కోసం బ్రాడ్‌ కంపెనీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ (ముందుగా నిర్మించిన) కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీని ఉపయోగించింది. ఈ భవనం నిర్మాణం కోసం ముందుగానే నిర్మించించిన కంటైనర్‌ సైజ్‌ బ్లాక్స్‌ను తీసుకువచ్చి.. ఒకదాని మీద ఒకటి పేర్చి బిల్డింగ్‌ నిర్మాణం పూర్తిచేశారు.

- Advertisement -

ఆ తర్వాత బోల్ట్స్‌ బిగించి వాటర్‌, కరెంట్‌ కనెక్షన్‌ ఇచ్చారు. ఇక ఈ మొత్తం నిర్మాణం పూర్తి కావడానికి 28 గంటల 45 నిమిషాల సమయం పట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో ఉంది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్‌లు క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
28 గంట‌ల్లో 10 అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణం.. వీడియో
28 గంట‌ల్లో 10 అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణం.. వీడియో
28 గంట‌ల్లో 10 అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణం.. వీడియో

ట్రెండింగ్‌

Advertisement