ఆదివారం 05 జూలై 2020
International - Jul 01, 2020 , 02:44:38

యాప్‌ల నిషేధంపై చైనా ఆందోళన

యాప్‌ల నిషేధంపై చైనా ఆందోళన

బీజింగ్‌, జూన్‌ 30: భారత సార్వభౌమత్వం, సమగ్రత, ప్రజల వ్యక్తిగత గోప్యతకు ముప్పు పొంచి ఉందన్న కారణంతో చైనాకు చెందిన 59 యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడంపై చైనా విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. భారత ప్రభుత్వ చర్య తమను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారుల చట్టపరమైన, న్యాయపరమైన హక్కులను కాపాడే బాధ్యత భారత ప్రభుత్వానిదేనని చెప్పారు. నిషేధం అనంతర పరిణామాలను సమీక్షిస్తున్నామని తెలిపారు. భారత్‌, చైనా మధ్య ఆచరణాత్మక సహకారం పరస్పర ప్రయోజనకరమైనదని చెప్పారు. భారత్‌ నిర్ణయం భారతీయుల ప్రయోజనాలకు అనుగుణమైనది కాదంటూ.. యాప్‌లపై నిషేధంతో తమకు జరిగిన నష్టాన్ని చెప్పుకోలేక గాంభీర్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించారు.


logo