శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 11, 2020 , 20:24:44

కరోనా పరిశోధన పత్రాలపై చైనా ఉక్కుపాదం

కరోనా పరిశోధన పత్రాలపై చైనా ఉక్కుపాదం

హైదరాబాద్: నవకరోనా లేదా కోవిడ్-19 వైరస్ చైనాలోని వూహాన్ నుంచి ప్రపంచమంతటికీ వ్యాపించిందనే విషయంలో దాదాపుగా ఏకాభిప్రాయం ఉంది. గ్రౌండ్ జీరోలో అంటే వూహాన్‌లో వైరస్ జంతువుల నుంచి మనుషులకు ఎలా సోకి ఎలా పాకిందనే విషయమై దేశదేశాల్లో ఆసక్తి ఉండడం సహజం. కానీ అందుకు సంబందించిన పరిశోధన పత్రాలపై చైనా నియంత్రణను అమలు చేస్తున్నది. తాజాగా కొన్ని యూనివర్సిటీలు, అధ్యయన కేంద్రాలు వెలువరించిన పత్రాలను నెట్ నుంచి తొలగించడం ఈ ఆలోచనకు ఊతమిస్తున్నది. ఫూదాన్ యూనివర్సిటీ, చైనా యూనివర్సిటీ ఆఫ్ జియో సైన్సెస్ (వూహాన్) ఇటీవల తమ వెబ్‌సైట్లలో పెట్టిన పేజీలు తర్వాత డిలిట్ చేశారు. ఈ దిశగా జరుగుతున్న పరిశోధన వివరాలు తనకు అనుకూలంగా మాత్రమే బయటకు రావాలని చైనా ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. అంటే తొలినాళ్లల్లో ఏదైనా నిర్లక్ష్యం జరిగిందా వంటి అంశాలపై బహుశ చైనా నాయకత్వం దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు కనిపిస్తున్నది. అందుకే ఈ సెన్సార్‌షిప్ అమలు చేస్తున్నారని పాశ్చాత్య దేశాల నిపుణులు అంటున్నారు.


logo