డోక్లాం దగ్గరలోనే చైనా ఆయుధ బంకర్లు

న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఓవైపు శాంతి చర్చల పేరుతో దృష్టి మరల్చి.. మరోవైపు సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతోంది. మొన్న భూటాన్ భూభాగంలోకి రెండు కిలోమీటర్ల మేర చొచ్చుకొని వెళ్లి ఏకంగా గ్రామాన్నే నిర్మించినట్లు తేలగా.. ఆ తర్వాత 9 కిలోమీటర్ల మేర రోడ్డునూ నిర్మించినట్లు శాటిలైట్ ఫొటోలు తేల్చాయి. తాజాగా సించె-లా పాస్‌కు 2.5 కిలోమీటర్ల దూరంలో చైనా ఏకంగా ఆయుధ బంకర్లు నిర్మించినట్లు తేలింది. మూడేళ్ల కిందట వివాదానికి కారణమైన డోక్లాం నుంచి ఈ ప్రాంతం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ ఆయుధ బంకర్లు చూస్తుంటే.. చైనా మిలిటరీ సంసిద్ధత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డోక్లాం ప్రాంతంలో మరోసారి వివాదం తలెత్తితే చైనా బలగాలు సమర్థంగా పోరాడేలా ఈ బంకర్లను ఏర్పాటు చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఆ లెక్కన ఈ ప్రాంతంలో తమ బలగాలను పెంచే ఆలోచనలో చైనా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అదే జరిగితే మరోసారి డోక్లాంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. నిజానికి గతేడాది డిసెంబర్లో ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు లేనట్లు అప్పటి శాటిలైట్ ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అక్టోబర్ 28న తీసిన ఫొటోల్లో మాత్రం నిర్మాణాలు పూర్తయినట్లు కనిపించింది. అంటే ఏడాదిలోపే ఈ బంకర్ల నిర్మాణాన్ని చైనా పూర్తి చేసింది.
తాజావార్తలు
- టీమిండియాను సర్కస్‌లో జంతువులలాగా చూశారు!
- WEF సదస్సులో 28న ప్రధాని ప్రసంగం..!
- కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ.. 14 మంది అరెస్ట్
- ఢిల్లీలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. ఎవరు వాళ్లు?
- వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ మృతి
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
- నేను ఐశ్వర్యరాయ్ కుర్రాడినంటూ ఓ వ్యక్తి హల్ చల్
- అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి
- దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
- దేశంలో కోల్డ్‌వేవ్ పరిస్థితులు