శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 02, 2020 , 17:53:43

ఎల్‌ఏసీ వెంట 5 జీ ఇన్‌ఫ్రాను నిర్మిస్తున్న చైనా

ఎల్‌ఏసీ వెంట 5 జీ ఇన్‌ఫ్రాను నిర్మిస్తున్న చైనా

న్యూఢిల్లీ : భారత్ తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి చైనా తన 5 జీ ఇన్‌ఫ్రాను సిద్దం చేసుకుంటున్నది. ప్యాంగ్యాంగ్ ట్సో వెంబడి చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దశాలు ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ వేస్తున్నట్లు అక్కడ జరుగుతున్న పనులను బట్టి సైనికాధికారులు గుర్తించారు. 

ఆగస్టు మొదటి వారంలో ఎల్‌ఏసీ వద్ద వివాదాస్పద ప్రదేశాల్లో ఒకటైన డెమ్‌చోక్ ప్రాంతానికి సమీపంలో 5 జి నిర్మాణం గుర్తించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త స్పెక్ట్రం బ్యాండ్‌విడ్త్‌ల కోసం పరికరాల సంస్థాపన, ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్స్ వేయడం, సెల్యులార్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ అభివృద్ధిని గుర్తించారు. పాంగ్యాంగ్ సరస్సు వెంబడి తాజా నిర్మాణ పనులు కనిపిస్తున్నాయని ఏజెన్సీలు హెచ్చరించాయి. పాంగ్యాంగ్ సరస్సు వద్ద కొత్త గుడిసెలు, షెడ్లు వెలిశాయి. గల్వాన్ ఘర్షణ అనంతరం ఇరు దేశాలు చర్చల్లో ఉన్న సమయంలో కూడా ఇక్కడ పనులు కొనసాగినట్లు తెలుస్తున్నది. మే నెలారంభంలో ఉద్రిక్తతలు తలెత్తి నాలుగు నెలల తర్వాత భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్నది. తొలుత గల్వాన్ లోయ, పెట్రోల్ పాయింట్ 15 లో పనులు ప్రారంభమయ్యాయి. పెట్రోంగ్ పాయింట్ 17A అని పిలువబడే పాంగ్యాంగ్ సరస్సు, గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం అస్థిరంగా ఉంది. పాంగ్యాంగ్ సరస్సు వద్ద, చైనా ఫింగర్-5, 8 మధ్య తన స్థానాలను బలపరిచుకున్నది. ఈ చర్యను భారత్ చాలా బలంగా చేపట్టాలి.

చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) మే ఆరంభం నుంచి అక్కడ కొత్త నిర్మాణాలను చేపట్టడం ద్వారా ఫింగర్ -4 నుంచి ఫింగర్ -8 వరకు ఆక్రమించిన 8 కిలోమీటర్ల విస్తీర్ణం నుంచి తూర్పు వైపునకు వెనక్కి తగ్గలేదు. జూన్ 15 న గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులతోపాటు పెద్ద సంఖ్యలో చైనా దళాలు మరణించాయి.


logo