సోమవారం 01 జూన్ 2020
International - Apr 13, 2020 , 12:38:54

హెచ్‌డీఎఫ్‌సీలో 1 శాతం వాటా సొంతం చేసుకున్న చైనా బ్యాంక్

హెచ్‌డీఎఫ్‌సీలో 1 శాతం వాటా సొంతం చేసుకున్న చైనా బ్యాంక్

హైదరాబాద్: చట్టం తనపని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా చైనా తన పని తాను చేసుకుపోతున్నది. ప్రపంచం దృష్టి కరోనా కల్లోలంపై కేంద్రీకృతమై ఉన్న నేపథ్యంలో చైనాకు చెందిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా భారత్‌లోని ప్రముఖ మార్ట్‌గేజ్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీలో 1 శాతం వాటా గుట్టుచప్పుడు కాకుండా సొంతం చేసుకున్నది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ కొనుగోలు జరిగింది. మార్కెట్లు కుప్పకూలిన సమయంలో 25 శాతం ధర తగ్గిన దశలో 1.75 కోట్ల షేర్లు చైనా బ్యాంకు కొన్నది. చైనా అదివరకే 0.8 శాతం వాటాలు కలిగి ఉన్నదని, ఇటీవల మరిన్ని షేర్లు కొనుగోలు చేసిందని హెచ్‌డీఎఫ్‌సీ వైస్-చైర్మన్, సీఈవో కేకీ మిస్త్రీ తెలిపారు. ఇప్పుడు 1 శాతం పరిమితి దాటినందున కొనుగోలును వెల్లడించాల్సి వచ్చింది. 


logo