బీజింగ్: చైనా నిర్మిస్తున్న సొంత స్పేస్ స్టేషన్ ‘తియాంగాంగ్’లో ఆదివారం మొదటిసారిగా ఇద్దరు వ్యోమగాములు స్పేస్‌వాక్ చేశారు. చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. స్పేస్ స్టేషన్‌లోని కోర్ మాడ్యూల్లో వ్యోమగాములు లూయీ బోమింగ్, టాంగ్ హోంగ్బో మెకానికల్ ఆర్మ్ సాయంతో నడిచినట్టు తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రత్యామ్నాయంగా చైనా ‘తియాంగాంగ్’ పేరుతో సొంత స్పేస్ స్టేషన్‌ను నిర్మిస్తున్నది.