మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 06, 2020 , 07:20:33

భూటాన్‌తో కూడా సమస్యలున్నాయి: చైనా

భూటాన్‌తో కూడా సమస్యలున్నాయి: చైనా

బీజింగ్‌: పొరుగు దేశాలపై ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వాలని చూసే చైనా మళ్లీ తన వక్ర బుద్ధిని చూపించింది. తాజాగా భూటాన్‌తో కూడా తమకు సరిహద్దు సమస్యలు ఉన్నట్లు డ్రాగన్‌ దేశం వెల్లడించింది. ‘పొరుగు దేశం భూటాన్‌తో తూర్పు, మధ్య, పశ్చిమ సెక్టార్‌లో మాకు చాలా ఏండ్లుగా సరిహద్దు సమస్యలున్నాయి’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ విషయంలో మూడో పక్షం ప్రమేయాన్ని ఒప్పుకోబోమని పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. భారత్‌, భూటాన్‌, చైనా సరహద్దుల్లోని డోక్లాం భూభాగం విషయమై మూడు దేశాల మధ్య గతేడాది వివాదం తలెత్తింది.   

కాగా భారతదేశ సరిహద్దుల్లో చైనా ఎప్పుడూ వివాదాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దుల్లో భారత్‌-చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగున్నది. అదేవిధంగా గత నెలలో గల్వాన్‌ లోయలో 20 మంది భారతీయ సైనికులను చైనా పొట్టన పెట్టుకున్నది. ప్రస్తుతం ఇరు దేశాలు సరిహద్దుల వెంబడి భారీగా బలగాలను మోహరిస్తున్నాయి.


logo