మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Sep 08, 2020 , 11:14:49

కోవిడ్19 మ‌హమ్మారిపై పార‌ద‌ర్శ‌‌కంగా వ్య‌వ‌హ‌రించాం: చైనా అధ్య‌క్షుడు

కోవిడ్19 మ‌హమ్మారిపై పార‌ద‌ర్శ‌‌కంగా వ్య‌వ‌హ‌రించాం:  చైనా అధ్య‌క్షుడు

హైద‌రాబాద్‌: క‌రోనా మ‌హ‌మ్మారిపై  చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ ప్ర‌క‌ట‌న చేశారు. కోవిడ్‌19పై బ‌హిరంగంగా, పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. తాము చేప‌ట్టిన చ‌ర్య‌ల వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్ర‌జ‌ల ప్రాణాలు నిలిచాయ‌న్నారు. నోవెల్ క‌రోనా వైర‌స్‌పై పోరాటం చేసిన వారిని గౌర‌విస్తూ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. బీజింగ్‌లో జ‌రిగిన‌ ఆ కార్య‌క్ర‌మంలో జీ జిన్‌పింగ్ మాట్లాడారు.  మ‌హ‌మ్మారి వ‌ల్ల తిరిగి వృద్ధి సాధించిన తొలి అతిపెద్ద ఆర్థిక దేశం చైనా అని ఆయ‌న తెలిపారు. దీని ద్వారా చైనా సామ‌ర్థ్యం, స‌త్తా తెలుస్తున్నాయ‌న్నారు.  

క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌లో చైనా అసాధార‌ణ‌మైన‌, చ‌రిత్రాత్మ‌క‌మైన ప‌రీక్ష‌ను నెగ్గిన‌ట్లు ఆయ‌న తెలిపారు. వైద్య రంగానికి చెందిన న‌లుగురికి ఆయ‌న స్వర్ణ‌ప‌త‌కాల‌ను అంద‌జేశారు. నోవెల్ క‌రోనా ప‌ట్ల విరోచిత పోరాటం చేశామ‌న్నారు.  కరోనా వైర‌స్ ప‌ట్ల తొలుత ప్ర‌జాయుద్ధాన్ని గెలిచామ‌న్నారు. ఆర్థిక వృద్ధిలోనూ, కోవిడ్ నియంత్ర‌ణ‌లోనూ ప్ర‌పంచంలో ముందంజ‌లో ఉన్నామ‌న్నారు. క‌రోనాను క‌ప్పిపుచ్చిన‌ట్లు అమెరికాతో పాటు ఆస్ట్రేలియా దేశాలు చైనాపై ఆరోప‌ణ‌లు చేశాయి.   

అధ్య‌క్షుడు జీ జిన్‌ఫింగ్ నుంచి గోల్డ్ మెడ‌ల్ అందుకున్న‌వారిలో 83 ఏళ్ల జాంగ్ నాన్‌షాన్ ఉన్నారు.  వైర‌స్ నియంత్ర‌ణ‌లో నాన్‌షాన్ కీల‌క‌పాత్ర పోషించారు. వైర‌స్ ఆన‌వాళ్ల‌ను గుర్తించేందుకు ప్ర‌పంచ వైద్య వ‌ర్క‌ర్ల‌తో జ‌త‌క‌ట్ట‌నున్న‌ట్లు జాంగ్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. ద మెడ‌ల్ ఆఫ్ ద రిప‌బ్లిక్ అవార్డును నాన్‌షాన్ అందుకున్నారు. ఇదే అత్యున్న‌త పుర‌స్కారం. క‌రోనా వైర‌స్ తొలుత వుహాన్ నుంచి వ‌చ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నా.. చైనా మాత్రం ఆ వైర‌స్ పుట్టుపూర్వోత్త‌రాలు త‌మ‌కు తెలియ‌దంటోంది.  బ‌యోకెమిక‌ల్ నిపుణుడు చెన్ వాయికి కూడా గోల్డ్ మెడ‌ల్ గెలిచారు. 
logo