సోమవారం 01 జూన్ 2020
International - May 06, 2020 , 13:24:09

వూహాన్‌లో బడిబాట పట్టిన చిన్నారులు

వూహాన్‌లో బడిబాట పట్టిన చిన్నారులు

హైదరాబాద్: కరోనా వైరస్ జన్మస్థానంగా భావించే చైనాలోని వూహాన్‌లో పిల్లలు మళ్లీ బడిబాట పట్టారు. జనవరిలో కరోనా విజృంభణ నేపథ్యంలో బడులు మూసివేసిన సంగతి తెలిసిందే. వూహాన్‌ను కరోనా మహమ్మారికి 'గ్రౌండ్ జీరో'గా అభివర్ణిస్తారు. తీవ్రదిగ్బంధనం అనంతరం ఆ నగరంలో కరోనా అదుపులోకి వచ్చింది. ఇప్పుడు కరోనా పూర్తిగా అదుపులోకి రావడంతో వూహాన్‌లో మళ్లీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. పిల్లలు కూడా బడులకు వెళుతున్నారు. బుధవారం తొలిరోజు భౌతిక దూరం పాటిస్తూ పిల్లలు మాస్కులు ధరించి  బడిలోకి అడుగు పెడుతుంటే సిబ్బంది థర్మామీటర్ గన్‌తో నుదుటి మీద టెంపరేచర్ తీసుకున్నారు. ఎట్టకేలకు బడులు తెరవడంతో ఇటు పిల్లలు, అటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదుల్లో కనీసం మీటరు ఎడంతో సీటింగ్ ఏర్పాటు చేశారు.


logo