బుధవారం 03 జూన్ 2020
International - May 12, 2020 , 17:04:44

కోవిడ్‌-19 అనుకున్న‌దానికంటే ఎక్కువ ప్ర‌మాదం

కోవిడ్‌-19 అనుకున్న‌దానికంటే ఎక్కువ ప్ర‌మాదం

న్యూయార్క్‌:  కోవిడ్-19 పిల్ల‌లు, టీనేజ్, యువ‌కులలో గ‌తంలో అనుకున్న దానికంటే ఎక్కువ ప్ర‌మాద‌క‌రంగా ప్ర‌భావం చూపిస్తుంది. గ‌తంలో అనారోగ్యానికి గురైన వారు, దీర్ఘ‌కాలిక అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వారి ప‌రిస్థితి ఇంకా ప్ర‌మాదంలో ఉంద‌ని, యువకుల‌పై కోవిడ్‌-19 ప్ర‌భావం చూపించ‌ద‌నేది ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌ని యూఎస్‌లోని ర‌ట్జ‌ర్స్ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన కో ఆథ‌ర్ లారెన్స్ క్లీన్మాన్ పేర్కొన్నారు. అధ్య‌య‌నం ప్ర‌కారం ఉబకాయం వంటి దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు ఉన్న పిల్ల‌లపై ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. దీర్ఘ‌కాలిక అనారోగ్యం లేని పిల్ల‌లు కూడా ప్ర‌మాదక‌ర ప‌రిస్థితుల్లో ఉన్నార‌ని, వైర‌స్‌ను త‌ల్లిదండ్రులు తీవ్రంగా ప‌రిగ‌ణించాల‌ని క్లిన్మార్ హెచ్చ‌రించారు. 

ఉత్త‌ర అమెరికాకు చెందిన 48 మంది కోవిడ్ వైర‌స్ పాజిటివ్ వ‌చ్చిన న‌వ‌జాత శిశువు నుంచి 21 సంవ‌త్స‌రాల యువ‌కులు మార్చ్ - ఏప్రిల్  నెల‌లో చికిత్స కోసం పీఐసీయూలో చేరారు. 80శాతం కంటె ఎక్కువ మంది పిల్ల‌లు రోగ‌నిరోధ‌క శాక్తి త‌క్కువ‌గా ఉండి, ఉబ‌కాయం, షుగ‌ర్‌, మూర్చ‌, ఉపిరితిత్తుల ఇన్షెక్ష‌న్ వంటి దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉన్న‌వారిపై అధ్య‌యం చేశాం. ఈ పిల్ల‌ల్లో 40శాతం మంది జ‌న్యుసంబంధ‌మైన కారణాల‌తో శారీర‌క ఎదుగుద‌ల లేద‌ని తేలింది. వీరిపై కోవిడ్-19 ఎక్కువ అవ‌య‌వ బాగాల‌పై ప్ర‌భావం చూపించింది. 

దాదాపు 40శాతం మందికి వెంటిలేట‌ర్ ద్వారా కృత్రిమ శ్వాస అందివ్వాల్సి వ‌చ్చింది. ఈ అధ్య‌య‌నంపై రాబ‌ర్డ్ వుడ్ జాన్స‌న్ మెడిక‌ల్ స్కూల్ పిడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ హ‌రిప్రేమ్ రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ... ఇది పిడియాట్రిక్ రోగుల‌లో కోవిడ్‌-19 ప్రారంభ గురించి ప్రాథ‌మిక అవ‌గాహ‌న క‌ల్పిస్తుంద‌ని తెలిపారు. ఐసీయూలో చేరిన పెద్ద‌ల్లో 62శాతం వ‌ర‌కు మ‌ర‌ణాల రేటుతో పోలిస్తే, పీఐసీయూ రోగుల మ‌ర‌ణాల రేటు 4.2 శాతంగా ఉంద‌న్నారు. పిల్ల‌ల్లో గుండెపై కోవిడ్ -19 నేరుగా ప్ర‌భావం చూపిస్తుంది. మ‌ల్టీ ఆర్గాన్స్ సిస్ట‌మ్ దెబ్బ‌తినే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. 


logo