ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Sep 04, 2020 , 08:18:15

పిల్లల్లో యాంటీబాడీలతోపాటే కరోనా.!

పిల్లల్లో యాంటీబాడీలతోపాటే కరోనా.!

వాషింగ్టన్ ‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్చిన్నారులపై మాత్రం పెద్దగా ప్రభావం చూపటం లేదని పలు గణాంకాలను బట్టి భావిస్తూ వస్తున్నారు. కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు పిల్లల్లో అధికంగా ఉండటమే అందుకు కారణమని భావించారు. కానీ యాంటీబాడీలతోపాటే పిల్లల్లో కరోనా వైరస్కూడా ఉంటున్నదని అమెరికాలోని చిల్డ్రన్స్నేషనల్హాస్పిటల్లో మార్చి 13 నుంచి జూన్‌ 21వరకు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 6,369 మంది చిన్నారులపై నిర్వహించిన పరిశోధన ఫలితాలు జర్నల్ఆఫ్పీడియాట్రిక్లో ప్రచురితమయ్యాయి. ‘శరీరంలో యాంటీబాడీలు ఉన్నాయంటే ఎలాంటి వైరస్కనడపడదు. కానీ కరోనా విషయంలో మేం యాంటీబాడీలతోపాటే  కొవిడ్‌-19ను కూడా గుర్తించాంఅని పరిశోధన పత్రం రాసిన బురక్బహర్తెలిపారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo