ఆదివారం 12 జూలై 2020
International - May 26, 2020 , 17:03:59

రోడ్డుపై గుంతల్లో కరోనా పెయింటింగ్‌లు

రోడ్డుపై గుంతల్లో కరోనా పెయింటింగ్‌లు

కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిల్ల.. హీనంగా చూడకు దేన్నీ.. కవితామాయయేనోయ్‌ అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఈయనగారి మాటలను ఒంటబట్టించుకొన్నాడో ఏమోగానీ..  చికాగోకు చెందిన ఓ ఆర్టిస్ట్‌.. రోడ్డుపై ఉన్న గుంతలను తన ఆర్ట్‌ ప్రావీణ్యాన్ని చూపే వేదికలుగా మలుచుకున్నాడు. చికాగోకు చెందిన ఆర్టిస్ట్ జిమ్‌ బాచర్‌ అనే ఆయన.. నగరంలోని ఉత్తర ప్రాంతంలో పాత్‌హోల్‌ ఆర్ట్‌ అనే సిరీస్‌ను ప్రారంభించాడు. 

గతంలో కూడా పాత్‌హోల్‌ ఆర్ట్‌ వేసిన ఈయన.. ప్రస్తుతం ట్రెండింగ్‌గా ఉన్న కరోనా వైరస్‌ను తన ఆర్ట్‌కు వస్తువుగా ఎంచుకొన్నాడు. ఇంకేం. చికాగోలోని పలు రోడ్లపై పడిన గుంతల్లో అందమైన చిత్రాలు గీసి వాటితో స్థానిక ప్రజలకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పించాడు. పాత్‌హోల్‌ ఆర్గ్‌ను చూస్తున్న వారంతా.. ఆహా ఓహో అంటూ ప్రశంసిస్తూ.. మనం కూడా పరిశుభ్రత పాటిద్దాం అనే విషయాన్ని మరోసారి మననం చేసుకొంటున్నారు. అదండీ జిమ్‌ బాచర్‌ గారి పాత్‌హోల్‌ ఆర్ట్‌ కహానీ.. మీరూ ఓ లుక్కేసి ఆనందించండి.


logo