శనివారం 28 మార్చి 2020
International - Mar 26, 2020 , 09:39:33

కరోనాతో.. అమెరికాలో క‌న్నుమూసిన‌ ప్ర‌ఖ్యాత బాంబే చెఫ్

కరోనాతో.. అమెరికాలో క‌న్నుమూసిన‌ ప్ర‌ఖ్యాత బాంబే చెఫ్

హైద‌రాబాద్‌: ప్ర‌ఖ్యాత భార‌తీయ చెఫ్ ఫ్లాయిడ్ కార్డోజ్ .. క‌రోనా వైర‌స్‌తో మృతిచెందాడు. అమెరికాలోని న్యూజెర్సీలో అత‌ను చ‌నిపోయాడు. అత‌ని వ‌య‌సు 59 ఏళ్లు.  బాంబే క్యాంటీన్‌, ఓ పెడ్రో రెస్టారెంట్ల ఓన‌ర్ ఆయ‌నే. ప్ర‌ప‌చం ప్ర‌ఖ్యాత చెఫ్‌గా కార్డోజ్‌కు గుర్తింపు ఉన్న‌ది. క‌రోనా ప‌రీక్ష‌లో అత‌ను పాజిటివ్‌గా తేలాడు. ముంబైలో పుట్టిన కార్డోజ్‌.. మాడ్ర‌న్ ఇండియ‌న్ కుజైన్‌లో చాలా ఫేమ‌స్‌.  న్యూయార్క్ సిటీలో ఉన్న త‌బ్లా రెస్టారెంట్‌ను ఈయ‌నే స్టార్ట్ చేశాడు.  దానికి ఎగ్జిక్యూటివ్ చెఫ్‌గా ప‌నిచేశాడు.  మార్చి 18వ తేదీన ఆయ‌న‌కు క‌రోనా సోకిన‌ట్లు తేలింది.  హంగ‌ర్ ఇన్ సంస్థ‌లో ఆయ‌న క‌లిన‌రీ డైరక్ట‌ర్‌గా చేస్తున్నాడు. కార్డోజ్ మృతి ప‌ట్ల ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత చెఫ్‌లు సంతాపం తెలిపారు. 


logo