గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Sep 14, 2020 , 16:12:37

మోదీ, సోనియా సహా 10 వేల మందిపై చైనా నిఘా

మోదీ, సోనియా సహా 10 వేల మందిపై చైనా నిఘా

న్యూఢిల్లీ : భారత్ పై చైనా కన్నేసింది. ఇప్పటివరకు ఎన్నో వస్తువులను మనకు దిగుమతి చేస్తూ ఆర్థికంగా ఎదిగిన చైనా.. గల్వాన్ ఘర్షణ అనంతరం తన రూటు మార్చింది. మన దేశానికి చెందిన ప్రముఖులతోపాటు వివిధ సంస్థల డేటాను దొంగిలించేందుకు చర్యలు ప్రారంభించింది. ఇప్పుడు తమ దేశంతో సంబంధాలున్న సంస్థతో నరేంద్ర మోదీ, సోనియాగాంధీ సహా 10 వేల మంది భారతీయులు, సంస్థలపై నిఘా పెట్టింది.

గల్వాన్ ఘర్షణ అనంతరం భారత ప్రభుత్వం చైనా యాప్ లపై నిషేధం విధించడంతో చైనా పెద్ద ఎత్తున నష్టపోతున్నది. సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించడం, ఆధునిక యుద్ధసామగ్రిని అందుబాటులో ఉంచడంతో చైనా అధిపతి జిన్ పింగ్ కు ఏమీ తోచడం లేదు. దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీలపై చైనా ప్రభుత్వం షెన్ జెన్ నగరానికి చెందిన జిన్ హువా డేలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ సహకారంతో కన్నేసి ఉంచింది. వీరి జాబితాలో 8 మంది కేంద్రమంత్రులు, ఐదుగురు ముఖ్యమంత్రులు, ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు, ప్రముఖుల కులుంబసభ్యులు, న్యాయ, మీడియా, స్పోర్ట్స్, రిలీప్ తదతర విభాగాలకు చెందినవారుండటం ఆందోళన కలిగిస్తున్నది. క్రిమినల్ కేసుల్లోని నిందితులను కూడా పర్యవేక్షిస్తున్నారు. 

త్రివిధ దళాలకు చెందిన 15 మంది మాజీ ముఖ్యుల ట్రాకింగ్ నివేదిక ప్రకారం.. చైనాలోని షెన్‌జెన్ నగరానికి చెందిన జిన్‌హువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ భారతీయులపై నిజసమయ పర్యవేక్షణను నిర్వహిస్తున్నది. భారతదేశ ప్రజలు, సంస్థల యొక్క ప్రతి సమాచారం సేకరణ లక్ష్యంగా  2 నెలలుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. త్రివిధ దళాలకు చెందిన 250 మంది అధికారులు, దౌత్యవేత్తలను కూడా ట్రాక్ చేస్తున్నట్లుగా సమాచారం.

200 మంది నాయకులపై పర్యవేక్షణ

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి దాదాపు 200 మంది చైనా పర్యవేక్షణలో చేర్చినట్లు తెలుస్తున్నది. వామపక్ష పార్టీలకు చెందిన 60 మంది కలుపుకుని మొత్తం 1,350 మంది రాజకీయ నాయకులను చైనా పర్యవేక్షిస్తున్నారని, వీరిలో 350 మంది ఎంపీలు ఉన్నారని తెలిసింది. 10,000 మంది భారతీయులపై చైనా ప్రభుత్వం నిఘా పెడుతున్నట్లు కాంగ్రెస్ నాయకుడు థరూర్ అన్నారు. ఇది చిన్న విషయం కాదని, లోతైన మైనింగ్ ఆపరేషన్ అని అభిప్రాయపడ్డారు. పర్యవేక్షణ ఉద్దేశం ఏమిటో, సేకరించే డేటా ఎలా ఉపయోగిస్తారో వేచి చూడాలి.


logo