శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 25, 2020 , 07:44:24

కరోనాతో కాలి వేళ్లలో మార్పులు..

కరోనాతో కాలి వేళ్లలో మార్పులు..

హౌస్టన్‌: మీ కాలి వేళ్లలో ఏ మైనా మార్పులు కనిపించాయా? కాలి వేళ్ల గోరు చుట్టూ లేదా కాళ్ల కింద చర్మం ఎర్రగా లేక ఉదా రంగులో ఉన్నదా? చర్మం పగిలినట్లు లేదా కమిలినట్లు ఉన్నదా? దురద లేక నొప్పి కలుగుతున్నదా? ఇలాంటి లక్షణాలు కరోనాకు సంకేతాలు కావచ్చని అమెరికా వైద్యులు చెబుతున్నారు. ‘కొవిడ్‌ టోస్‌'గా పేర్కొనే ఈ లక్షణాలు ఎక్కువగా పిల్లలు, యువతతోపాటు కొద్దిపాటి వైరస్‌ లక్షణాలున్నవారిలో కనిపిస్తున్నట్లు చర్మ వ్యాధి నిఫుణుడు డాక్టర్‌ అమీ పల్లెర్‌ తెలిపారు. అయితే ఇవి కరోనా లక్షణాలేనా అన్నది కచ్చితంగా చెప్పలేమన్నారు.


logo