మంగళవారం 27 అక్టోబర్ 2020
International - Sep 30, 2020 , 03:29:27

‘చందమామ’ తాతయ్య ఇకలేరు!

‘చందమామ’ తాతయ్య ఇకలేరు!

  • శంకర్‌ కన్నుమూత 

చెన్నె: ‘చందమామ’ పిల్లల పత్రిక ద్వారా నాలుగు తరాల భారతీయులను తన చిత్రాలతో ఆకట్టుకున్న శంకర్‌ (పూర్తిపేరు కేసీ శివశంకరన్‌)  కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంతో చెన్నెలో మంగళవారం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 96 ఏండ్లు. 1924లో చెన్నెలోని ఈరోడ్‌లో జన్మించిన శంకరన్‌.. 1946 నుంచి తుది శ్వాస విడిచే వరకూ బొమ్మలే ప్రాణంగా గడిపారు. 1946లో ‘కళాయిమగల్‌' అనే తమిళ పత్రికలో పనిచేశారు. ఆ తర్వాత దిగ్గజ నిర్మాతలు నాగిరెడ్డి-చక్రపాణి ప్రారంభించిన ‘చందమామ’ కథల పత్రిక ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. 


logo