శనివారం 31 అక్టోబర్ 2020
International - Oct 12, 2020 , 02:55:10

ఈ బాలిక బ్రిటిష్‌ హైకమిషనర్‌

ఈ బాలిక బ్రిటిష్‌ హైకమిషనర్‌

చిత్రంలో కనిపిస్తున్న బాలిక పేరు చైతన్య వెంకటేశ్వరన్‌. న్యూఢిల్లీకి చెందిన ఈ బాలిక గత బుధవారం బ్రిటిష్‌ హైకమిషనర్‌గా ఒక్కరోజు పనిచేశారు. అక్టోబరు 11న ప్రపంచ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారం, మహిళా సాధికారతపై ప్రచారంలో భాగంగా బ్రిటిష్‌ హై కమిషన్‌ చైతన్యను ఒక్కరోజు హైకమిషనర్‌గా నియమించింది. బ్రిటిష్‌ హై కమిషన్‌ 2017 నుంచి ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.