ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Sep 17, 2020 , 17:22:34

ఆ రహస్యాన్ని బయటపెట్టిన చైనా వైరాలజిస్ట్ ట్విటర్ అకౌంట్ క్లోజ్

 ఆ రహస్యాన్ని బయటపెట్టిన చైనా వైరాలజిస్ట్ ట్విటర్ అకౌంట్ క్లోజ్

బీజింగ్ : కొవిడ్-19 వైరస్ ను వూహాన్ ల్యాబ్ లో డెవలప్ చేశారంటూ బహిరంగంగా ప్రకటించిన వైరాలజిస్ట్ లీ-మెంగ్ యాన్ ట్విటర్ అకౌంట్ క్లోజ్ అయింది. చైనా సర్కారు కావాలనే ఈ వైరస్ ను ఉత్పత్తి చేసి, రిలీజ్ చేసిందని ఆమె ప్రకటించింది. ఈ క్రమంలో ఆమె అకౌంట్ ను ట్విటర్ మూసివేసింది. 'అకౌంట్ సస్పెండెడ్.. ట్విటర్ సస్పెండ్స్ అకౌంట్స్ విచ్ వయోలేట్స్ ది ట్విటర్ రూల్స్' అంటూ ఆమె ట్విట్టర్ ఖాతాలో ఓ మెసేజ్ ప్రత్యక్షమైంది. ఆమె అకౌంట్ క్లోజ్ అవ్వడానికి మాత్రం కారణాలను వెల్లడించలేదు. కరోనా వైరస్ కు సంబంధించిన వివాదాస్పద కంటెంట్ ను ట్వీట్స్ ను ఆపేస్తామంటూ ఈ సోషల్ జెయింట్ మే నెలలోనే హెచ్చరించింది.

కాగా-తన ఖాతా తొలగింపుపై స్పందించిన లీ-మెంగ్... వాస్తవాలను తెలుసుకోవడానికి 'ఇలాంటి వారు' ఇష్టపడరని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్య... ప్రభుత్వ పెద్దలను ఉద్దేశించి చేసిందేనని భావిస్తున్నారు. కోవిడ్ వైరస్ మనిషి చేసిందే తప్ప ..ప్రకృతి నుంచి వచ్చింది కాదని ఆమె పేర్కొన్న విషయం తెలిసిందే. చైనా ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందన్న భయంతో లీ-మెంగ్ యాన్ హాంకాంగ్‌కు షిఫ్ట్ అయింది. తనకే కాక, తన కుటుంబ సభ్యులకు కూడా చైనా ప్రభుత్వం హాని తలపెట్టవచ్ఛునని లీ-మెంగ్ యాన్ ఆందోళన చెందుతున్నది. అయితే ప్రపంచానికి వాస్తవాలు ధైర్యంగా చెబుతానని అంటున్నది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo