శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 10, 2020 , 08:43:33

దుబాయ్‌కి ఛలో.. ఛలో!

దుబాయ్‌కి ఛలో.. ఛలో!

న్యూఢిల్లీ: దుబాయ్‌కు వెళ్లాలనుకుంటున్న భారతీయులకు త్వరలోనే కేంద్రం శుభవార్త చెప్పనున్నది. చెల్లుబాటయ్యే వీసాలు కలిగి ఉన్న భారతీయులు యూఏఈ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నదని యూఏఈలో భారత రాయబారి పవన్‌ కపూర్ ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడనున్నదని, దానితర్వాతే ప్రయాణికులు విమాన టికెట్లు బుక్‌ చేసుకోవాలన్నారు. 

దుబాయ్‌కి ఏటా వేల మంది భారతీయులు ప్రయాణిస్తారు. దుబాయ్‌లో లాక్‌డౌన్‌ ఆంక్షలను జూలై 7న ఎత్తివేశారు. కాగా దుబాయ్‌కి వచ్చే ప్రయాణికులు విమానం ఎక్కడానికి 4 రోజుల ముందు కరోనా పీసీఆర్‌ టెస్టు చేయించుకోవాలని, నెగెటివ్‌ వస్తేనే అనుమతిస్తామని ఎమిరేట్స్‌ సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొన్నది.


logo