శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Mar 26, 2020 , 12:55:16

గ్లిట‌ర్ మాస్కుల‌తో హాజ‌ర‌వుతున్నారు..

గ్లిట‌ర్ మాస్కుల‌తో హాజ‌ర‌వుతున్నారు..

క‌రోనా వైర‌స్‌పై ప్ర‌తిఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉంటున్నారు. ఎక్క‌డికి వెళ్లినా వారి భ‌ద్ర‌త‌ను పాటిస్తున్నారు. ఆఫ్రికాలోని నైజీరియాలో జ‌రిగిన గ్లిట్జీ అవార్డు సెర‌మోనీలో ప్ర‌ముఖ సెల‌బ్రిటీలు గ్లిట‌ర్ దుస్తులు ధ‌రించి ఔరా అనిపించారు. ఇవి చూసేందుకు చాలా అందంగా ఆహ్లాదక‌రంగా ఉన్నాయి. అంతేకాదు. ఈ క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాపిస్తుండ‌టంతో ప్ర‌తిఒక్క‌రూ మాస్కులు ధ‌రించి వారి ప్రాణాల‌ను కాపాడుకుంటున్నారు. 

అయితే బంగారు వ‌ర్ణంలో మెరిసిపోతున్న వీరి మాస్కులు కూడా జిగేల్‌మంటున్నాయి. వ‌స్త్ర‌ధార‌ణ‌కు స‌రిప‌డేలా మాస్కును డిజైన్ చేసుకున్నారు. ఈ మాస్కుల‌ను మొద‌ట యూ.ఎస్ సింగ‌ర్ బిల్లీ ఇల్లీస్‌ వీటిని డిజైన్ చేపించింది. దీనిని జ‌న‌వ‌రిలో జ‌రిగిన జ‌ర్మ‌నీ అవార్డ్స్‌కు ధ‌రించింది. ఇప్పుడు ఆ ప‌ద్ధ‌తిని నైజీరియా సెల‌బ్రిటీలు వైర‌స్‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఫాలో అవుతున్నారు. ఫ్యాష‌న్ అందం కోస‌మే కాదు ఆరోగ్యం కోసం కూడా అనే నినాదంతో నైజీరియా సెల‌బ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు.


logo