శుక్రవారం 23 అక్టోబర్ 2020
International - Sep 24, 2020 , 18:02:09

చిన్నపిల్లలు ఆడుకుంటుంటే సింహం చూస్తూ కూర్చుంది!

చిన్నపిల్లలు ఆడుకుంటుంటే సింహం చూస్తూ కూర్చుంది!

కాలిఫోర్నియా: ఓ సింహం జనావాసాల్లోకి వచ్చింది. ఒకరి ఇంటిముందు కలియతిరిగింది. అనంతరం వీధిలోకి వెళ్లింది. అక్కడ చిన్నపిల్లలు సైకిల్‌ తొక్కుకుంటూ ఆడుకుంటుండగా వారిని చూస్తూ కూర్చుండిపోయింది. అచ్చం పెంపుడు  జంతువులాగా వ్యవహరించింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

కాలిఫోర్నియాలోని పసిఫిక్ ప్రాంతంలో నివసించే తిమోతి కెర్రిక్ అనే వ్యక్తి ఇంటి ముందుకు ఈ సింహం వచ్చింది. బాల్కనీలో ఉన్న అతడు వెంటనే కెమెరా తీసుకొని దాన్ని చిత్రీకరించాడు. అలాగే, రోడ్డుపై ఆడుకుంటున్న తన పిల్లలపై దృష్టిపెట్టాడు. అయితే, సింహం సైలెంట్‌గా కూర్చుని చూస్తుండడంతో అతడూ కంగారు పడలేదు. కొద్దిసేపటికి అది అక్కడినుంచి వెళ్లిపోయింది. దీంతో తిమోతి ఊపిరిపీల్చుకున్నాడు. ఈ వీడియోను యూట్యూబ్ పేజీలో పోస్ట్ చేయగా, నెటిజన్లు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇది ప్రముఖ వీడియో షేరింగ్ అప్లికేషన్‌లో 10 లక్షలకు పైగా వీక్షణలను సంపాదించింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo