బుధవారం 27 మే 2020
International - May 17, 2020 , 01:04:09

పిల్లులు.. వైరస్‌ వాహకాలు!

పిల్లులు.. వైరస్‌ వాహకాలు!

వాషింగ్టన్‌: కరోనా సోకిన పిల్లులు ఆ వ్యాధికి వాహకాలుగా మారే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అమెరికా, జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం విస్కాన్సిన్‌ వర్సిటీలో పిల్లులపై ప్రయోగాలు జరిపింది. మొదట కరోనా రోగి నుంచి సేకరించిన కరోనా వైరస్‌ను వీరు మూడు పిల్లులపై ప్రయోగించారు. మరుసటి రోజు ఆ పిల్లుల ముక్కు నుంచి స్రావాలను సేకరించి పరీక్షించగా.. రెండింటికి వైరస్‌ సోకినట్టు తేలింది. మూడోరోజునాటికి అన్ని పిల్లులు కరోనా బారిన పడ్డాయి. ఆ మరుసటిరోజు శాస్త్రవేత్తలు మూడు పిల్లులను వేర్వేరు బోన్లలో ఉంచి, ఆరోగ్యంగా ఉన్న ఒక్కో పిల్లిని జత చేశారు. 6 రోజుల తర్వాత పరీక్షించగా కొత్తగా వచ్చిన మూడు పిల్లులకు సైతం వైరస్‌ సోకింది. అయితే వేటిలోనూ వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. 


logo