బుధవారం 03 జూన్ 2020
International - Apr 13, 2020 , 15:02:23

పిల్లి వ‌ర్సెస్ కుక్క‌..ఏది గెలిచిందో మ‌రి..వీడియో

పిల్లి వ‌ర్సెస్ కుక్క‌..ఏది గెలిచిందో మ‌రి..వీడియో

సాధార‌ణంగా కుక్క‌కు పిల్లికి ప‌డ‌ద‌నే విష‌యం తెలిసిందే. అయితే పెట్స్ విష‌యంలో మాత్రం ఇది కొంత‌వ‌ర‌కు మిన‌హాయింపు. ఎందుకంటే పెంపుడు పిల్లి, కుక్క‌కు య‌జ‌మానులు కొన్ని విష‌యాలు నేర్పిస్తారు కాబ‌ట్టి..కుక్క‌, పిల్లి స‌ర‌దాగా ఉంటుంటాయి. లాక్ డౌన్ స‌మ‌యంలో చాలా వ‌ర‌కు ఛాలెంజ్‌లు తెర‌పైకి వస్తున్నాయి. అలాంటిదే క్యాట్ వ‌ర్సెస్ డాగ్ ఛాలెంజ్‌. ఓ మ‌హిళ త‌న ఇంట్లో ఫేషియ‌ల్స్, షాంపేయిన్స్, ఇత‌ర సీసాల‌ను ఒక రూం నుంచి మ‌రో రూంకు వెళ్లే దారిలో పెట్టింది.

ఛాలెంజ్ ఏంటంటే పిల్లి, కుక్క ఆ సీసాల‌కు ఏమీ కాకుండా వాటిని దాటి ముందు రూంకు వెళ్లాలి. బ్లాక్ క్యాట్ ఎంచ‌క్కా ఒక్క బాటిల్ ను కూడా కిందప‌డుకుండా ముందుకెళ్లింది. కుక్క మాత్రం వాటి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఆగింది. ఏం చేయాలో అర్థం కాక..సీసాల‌పై నుంచి దూకి ఛాలెంజ్ గెలుస్తాన‌నుకుంది. కానీ సీన్ రివ‌ర్సైంది. కుక్క దూకుడుకు కొన్ని సీసాలు చెల్లాచెదుర‌య్యాయి. అలా పిల్లి గెలిచి..కుక్క ఓడింద‌న్న‌మాట‌. ఇటీవ‌లే ఈ వీడియోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేయ‌గా..7.8 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo