బుధవారం 25 నవంబర్ 2020
International - Oct 22, 2020 , 17:20:41

వర్షం లేదుగానీ ఇంట్లో వరద..ఏం జరిగిందంటే..?

వర్షం లేదుగానీ ఇంట్లో వరద..ఏం జరిగిందంటే..?

పొట్టు: ఆ రోజు వర్షంలేదు. కానీ ఇంట్లో వరద.. బయటకు వెళ్లి వచ్చిన ఇంటి యజమాని డోర్‌ తెరిచి చూడగానే షాక్‌. ఇన్ని నీళ్లు ఎలా వచ్చాయో మొదట ఆమెకు అర్థంకాలేదు. బాత్‌రూంలోకి వెళ్లిచూసి అదంతా పిల్లి పనే అని కనిపెట్టింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

జాస్మిన్‌ స్టార్క్‌(26) అనే మహిళ షాపింగ్‌ చేసేందుకు బయటకు వెళ్లింది. అయితే, ఆమె పెంపుడు పిల్లి ఆంబర్‌ మెల్లగా బాత్‌రూంలోకి వెళ్లి కుళాయి ఆన్‌చేసి, ప్లగ్‌హోల్‌ను మూసేసింది. ఇంకేముంది నీరంతా సింక్‌లోనుంచి గది పైకప్పు మీదుగా ప్రవహించింది. యజమాని వచ్చి చూసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెంపుడు పిల్లి ఈ అల్లరి చేష్ట ఆ ఇంటి యజమానికి వేల పౌండ్ల నష్టం కలుగజేసిందట. ‘ఇంకా నయం అరగంట పోయాను కాబట్టి సరిపోయింది.. అదే రోజంతా పోయి ఉంటే నా ఇల్లు గుల్లయ్యేది..’అని ఆ యజమాని వాపోయింది.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.