సోమవారం 01 జూన్ 2020
International - Apr 29, 2020 , 20:50:22

యుద్ధాన్ని మించిన ప్రాణ‌న‌ష్టం

యుద్ధాన్ని మించిన ప్రాణ‌న‌ష్టం

వాషింగ్టన్: అమెరికాలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. క‌రోనా కేసుల్లోనూ, మ‌ర‌ణాల్లోనూ ఆ దేశం ప్రపంచ దేశాల‌ను మించిపోయింది. ముఖ్యంగా అక్క‌డ‌ మునుపెన్నడూ లేనన్ని మరణాలను నమోదు అవుతున్నాయి. ఇప్ప‌టికే క‌రోనాతో చనిపోయిన వారి సంఖ్య 58,955 కు చేరింది. కరోనా సోకిన వారి సంఖ్య  ఒక మిలియన్ మార్కును దాటింది. అమెరికా అగ్రరాజ్యంగా ఎదిగే క్రమంలో ఆ దేశం వియత్నాంతో చేసిన యుద్ధం.. అత్యధికంగా అమెరికన్లు చనిపోయిన ఘట్టంగా చరిత్రలో నిలిచిపోయింది. అయితే, కరోనా వైరస్ వ్యాపిస్తున్న ప్రస్తుత సమయంలో వియత్నాం యుద్ధ సమయంలో కంటే ఎక్కువగా అమెరికా ప్రాణ నష్టాన్ని చూడాల్సివస్తోంది. గ‌తంలో వియత్నాం వివాదంలో 58,220 మంది అమెరికన్ సైనికులు మరణించ‌గా... ఇప్పుడు దాన్ని మించిపోయింది.


logo