గురువారం 28 మే 2020
International - Apr 04, 2020 , 01:02:41

శ్వాస ద్వారానూ వ్యాప్తి!

శ్వాస ద్వారానూ వ్యాప్తి!

వాషింగ్టన్‌: గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా? లేదా? అన్నది స్పష్టంగా తేలకముందే.. ‘సాధారణ శ్వాస’ ద్వారా కూడా వైరస్‌ గాలిలోకి చేరుతుందని అమెరికా శాస్త్రవేత్త హెచ్చరించారు. సంక్రమిత వ్యాధులపై ఏర్పాటైన స్టాండింగ్‌ కమిటీ అధిపతి హార్వే ఫైన్‌బర్గ్‌ ఈ నెల 1న శ్వేతసౌధానికి రాసిన లేఖలో ఈ అంశాన్ని పేర్కొన్నారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా,  వైరస్‌ బాధితులు తాకిన ఉపరితలాలను ముట్టుకొని, అనంతరం అదే చేతులతో నోరు, ముక్కు, కన్నును తాకడం వల్ల వైరస్‌ సంక్రమిస్తుందని ఇప్పటివరకు అన్ని సంస్థలు భావిస్తున్నాయి. అయితే ఊపిరి వదిలినప్పుడు వెలువడే అతిసూక్ష్మ కణాల ద్వారా  వైరస్‌ గాల్లోకి చేరుతుందని ఫైన్‌బర్గ్‌ హెచ్చరించా రు. ఇదే జరిగితే వైరస్‌ నుంచి రక్షణ మరింత కష్టతరంగా మారుతుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


logo