సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Mar 26, 2020 , 19:43:24

క‌రోనాతో యాభైశాతం పైగా పెరిగిన వాట్సప్ వాడకం !

క‌రోనాతో యాభైశాతం పైగా పెరిగిన వాట్సప్ వాడకం !

క‌రోనాతో ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ వాడకం వేగంగా పెరుగుతుంది. కోవిడ్-19తో ప్రపంచమంతా లాక్‌డౌన్ అయన విషయం విదితమే. సోషల్ డిస్టెన్స్ పెరుగడంతో ఆయా దేశాలలో ప్ర‌జ‌లు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి వాట్స‌ప్ చాలా ఎక్కువగా వాడుతున్నట్లు గ్లోబల్ రిసెర్చ్ కంటార్ సంస్థ‌ సర్వేలో తేలింది. కరోనా మొదటి దశలో 27 శాతం పెరిగిన వాట్సప్ వినియోగం రెండోదశలో 41 శాతానికి చేరింది. మహ్మరిగా మారిన ప్రస్తుత త‌రుణంలో వాట్సప్ వినియోగం 51 శాతానికి చేరినట్లు వెల్లడయ్యింది. ముఖ్యంగా 18-34 ఏండ్ల వయస్సు వారు వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు సర్వే తెలిపింది. స్పెయిన్‌లో వాట్సప్ వినియోగం సమయం 76 శాతం పెరిగింది. ఈ సర్వేలో 25,000 మంది వినియోగదారులు,  30 మార్కెట్లు పాల్గొన్నాయి. సోషల్ మీడియా చూసేవారి సంఖ్య సాధారణ సంఖ్య కంటే 61 శాతం పెరిగినట్లు వెల్లడయ్యింది. ఇదే సమయంలో వార్తల విషయంలో ఎక్కువమంది సంప్రదాయ న్యూస్‌చాన‌ల్స్, దినపత్రికలపైనే 52 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు.  logo