బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Sep 09, 2020 , 10:09:49

క‌ల్ప‌నా చావ్లా పేరుతో నింగిలోకి కార్గో స్పేస్‌క్రాఫ్ట్‌

క‌ల్ప‌నా చావ్లా పేరుతో నింగిలోకి కార్గో స్పేస్‌క్రాఫ్ట్‌

హైద‌రాబాద్‌: నార్త్‌రోప్ గ్రుమ్మ‌న్ సంస్థ ఓ క‌మ‌ర్షియ‌ల్ కార్గో వ్యోమ‌నౌక‌ను నింగికి పంప‌నున్న‌ది. అంత‌ర్జాతీయ స్పేస్ స్టేష‌న్‌కు అది స‌ర‌కు తీసుకువెళ్ల‌నున్న‌ది. అయితే ఆ కార్గో స్పేస్‌క్రాఫ్ట్ మోసుకువెళ్లే సిగ్న‌స్ క్యాప్సూల్‌కు భార‌తీయ సంత‌తికి చెందిన వ్యోమ‌గామి క‌ల్ప‌నా చావ్లా పేరు పెట్టారు. ఈనెల 29వ తేదీన ఆ అంత‌రిక్ష నౌక నింగికి ఎగ‌ర‌నున్న‌ది.  2003లో అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగివ‌స్తున్న స‌మ‌యంలో కొలంబియా వ్యోమ‌నౌక‌ల నింగిలో పేలిన విష‌యం తెలిసిందే. ఆ స్పేస్‌క్రాఫ్ట్‌లో క‌ల్ప‌నా చావ్లా ప్రాణాలు కోల్పోయింది. నార్త్‌రోప్ గ్రుమ్మాన్ అంటేర‌స్ రాకెట్ ద్వారా  ఎస్ఎస్ క‌ల్ప‌నా చావ్లాను నింగిలోకి పంప‌నున్న‌ది. వ‌ర్జీనియాలోని వాలోప్స్ ఫ్ల‌యిట్ ఫెసిలిటీ సెంట‌ర్ నుంచి దీన్ని ప్ర‌యోగిస్తారు.  రెండు రోజుల త‌ర్వాత అది అంత‌రిక్ష కేంద్రానికి అనుసంధానం అవుతుంది.

మాన‌వ అంత‌రిక్ష‌యాత్ర‌లో కీల‌క పాత్ర పోషించిన ప్ర‌తి ఒక్క‌రి పేరును సిగ్న‌స్ క్యాప్సూల్‌కు పెట్ట‌డం నార్త్‌రోప్ కంపెనీ సాంప్ర‌దాయం. అయితే ఈ సారి భార‌తీయ సంత‌తికి చెందిన క‌ల్ప‌నా చావ్లాకు ఆ అవ‌కాశం ద‌క్క‌డం విశేషం. ఎన్‌జీ 14 మిష‌న్‌లో భాగ‌మైన ఎస్ఎస్ క‌ల్ప‌నా చావ్లా సుమారు 3630 కిలోల కార్గో మోసుకువెళ్తుంది. హ‌ర్యానాలో పుట్టిన క‌ల్ప‌నా చావ్లా.. ఏరోస్పేస్ ఇంజ‌నీరింగ్ మాస్ట‌ర్స్ డిగ్రీ .. టెక్సాస్ వ‌ర్సిటీలో చేసింది.  ఆ త‌ర్వాత డాక్ట‌ర్స్ డిగ్రీని కొల‌రాడో వ‌ర్సిటీలో 1988లో పూర్తి చేసింది.  logo