సోమవారం 06 జూలై 2020
International - Jun 03, 2020 , 15:45:59

సముద్రంలోకి కారు..మరి బయటకు తీశారా..? వీడియో

సముద్రంలోకి కారు..మరి బయటకు తీశారా..? వీడియో

యూకేలోని ఓ సముద్రతీరంలో కారు చిక్కుకుపోయింది. అలలతాకిడికి సముద్రంలోపలికి కొట్టుకెళ్తున్న కారును పట్టుకునేందుకు చాలా సేపు ప్రయత్నించాడు యజమాని. ఓ వ్యక్తి వోక్స్ వాగన్ గోల్ప్ కారులో తీరంలో సరదాగా సేదతీరేందుకు తన ఫ్యామిలీతో కలిసి వెళ్లాడు. అయితే సదరు వ్యక్తి తన కారును తీరానికి దగ్గరగా పార్కు చేశాడు. అలలతాకిడి కాస్తా ఆ కారు నీటిలోకి వెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన కారు యజమాని అలల ఉధృతితో సముద్రంలోకి వెళ్తున్న కారును పట్టుకునేందుకు ప్రయత్నించాడు.

కారును పట్టుకునేందుకు మరో వ్యక్తి అతనికి సాయం చేసేందుకు వచ్చాడు. యజమాని కారును కోల్పోయాడు..అంటూ ఓ వ్యక్తి కెమెరా ఆఫ్ చేస్తున్న దృశ్యాన్ని వీడియోలో చూడొచ్చు. ఇంతకీ ఆ కారును బయటకు వచ్చిందా..రాలేదా..? అనేదే కదా మీ డౌటు. రోప్ సాయంతో వెళ్లిన వ్యక్తి సాయంతో కారు యజమాని..వోక్స్ బయటకు తీసుకొచ్చాడని యూకే పత్రిక ది సన్ తన కథనంలో పేర్కొంది. లీ డోల్బీ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఫేస్ బుక్ లో 3.6 వ్యూస్ రావడమే కాకుండా..వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. logo