సోమవారం 25 జనవరి 2021
International - Dec 10, 2020 , 21:41:19

కారు బాంబు పేలుడులో 16 మంది మృతి

కారు బాంబు పేలుడులో 16 మంది మృతి

డమాస్కస్: కారు బాంబు పేలుడులో 16 మంది మరణించారు. చనిపోయిన వారిలో ముగ్గురు టర్కీ సైనికులు ఉన్నారు. మరో 12 మంది గాయపడ్డారు. ఈశాన్య సిరియాలోని టర్కీ ఆధీనంలో ఉన్న సరిహద్దు పట్టణం రాస్ అల్-ఐన్లోని చెక్ పాయింట్ వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. భద్రతా దళాలు గస్తీ నిర్వహించే చెక్‌ పోస్ట్‌ వద్ద బాంబులతోకూడిన కారును పేల్చి వేశారు. ఈ ఘటనలో 16 మంది  చనిపోయారని, 12 మంది గాయపడ్డారని బ్రిటన్‌ కేంద్రంగా పనిచేస్తున్న సిరియా పరిణామాలను పరిశీలించే మానవ హక్కుల సంస్థ తెలిపింది. మరణించిన వారిలో ముగ్గురు టర్కీ జవాన్లు ఉన్నట్లు పేర్కొంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo