బుధవారం 27 జనవరి 2021
International - Jan 07, 2021 , 15:46:44

భ‌ద్ర‌తా బ‌ల‌గాల గ‌న్నుల‌న్నీ.. ఆ ఎంట్రీ డోర్‌ వైపే

భ‌ద్ర‌తా బ‌ల‌గాల గ‌న్నుల‌న్నీ.. ఆ ఎంట్రీ డోర్‌ వైపే

వాష్టింగ‌న్‌: ఈ ఫోటో చూశారా. ఇది గ‌న్ క‌ల్చ‌ర్ అని అనుకుంటే పొర‌పాటే. క్యాపిట‌ల్ హిల్‌లోకి ప్ర‌వేశించిన ట్రంప్ మ‌ద్ద‌తుదారుల్ని అడ్డుకునేందుకు భ‌ద్ర‌తా బ‌ల‌గాలు చేసిన సాహ‌సం ఇది.  ఛాంబ‌ర్‌లోకి చొచ్చుకువ‌చ్చేందుకు ట్రంప్ అభిమానులు హౌజ్ డోర్‌ను ప‌గుల‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఆ డోర్‌ నుంచి ఛాంబ‌ర్‌లోకి ఎంట‌ర్ అయ్యేందుకు కుస్తీప‌డ్డారు. ఆ స‌మ‌యంలో ఛాంబ‌ర్‌లో ఉన్న భ‌ద్ర‌తాద‌ళ స‌భ్యులంతా ప్ర‌జాప్ర‌తినిధుల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేశారు.  త‌మ వ‌ద్ద ఉన్న గ‌న్నులను తీసి.. ఆ డోర్‌ వైపు ఎక్కుపెట్టారు.  ఛాంబ‌ర్‌లోకి నిర‌స‌న‌కారులు ఎవ‌రు వ‌చ్చేందుకు సాహ‌సం చేసినా.. వారిపై బుల్లెట్లు దింపేందుకు సెక్యూర్టీ సిబ్బంది గ‌న్‌పాయింట్‌లో రెఢీగా ఉన్నారు. ట్రంప్ మ‌ద్ద‌తుదారులు ప్ర‌వేశించాల‌నుకున్న డోర్ వ‌ద్ద బ్యారికేడ్‌లా గ‌న్నుల‌తో పోలీసులు ఆఫీస‌ర్లు నిలుచున్న తీరు క్యాపిట‌ల్ హిల్‌లో జ‌రిగిన హింస‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది. డోర్‌ వైపు గ‌న్నులు ఎక్కుపెట్టిన బ‌ల‌గాలు.. ఆ ఛాంబ‌ర్‌లో ఉన్న ప్ర‌జాప్ర‌తినిధులు, సిబ్బంది, రిపోర్ట‌ర్ల‌ను త‌క్ష‌ణ‌మే సుర‌క్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. ఆ టెన్ష‌న్‌లో.. ఆ భ‌యంలో.. ప్ర‌జాప్ర‌తినిధులు ఎవ‌రికి తోచిన వైపు.. అటు వాళ్లు ప‌రుగులు తీశారు.   

ఇవి కూడా చదవండి..

అమెరికా హింస‌: న‌లుగురు మృతి.. 52 మంది అరెస్టు

ట్రంప్‌ను గ‌ద్దె దించ‌వ‌చ్చా? 25వ స‌వ‌ర‌ణ ఏం చెబుతోంది?

అమెరికా చ‌రిత్ర‌లో చీక‌టి రోజు.. అస‌లేం జ‌రిగింది?

అస‌లు క్యాపిట‌ల్ హిల్ అంటే ఏంటో తెలుసా?


logo