శనివారం 30 మే 2020
International - Apr 26, 2020 , 01:11:54

లాక్‌డౌన్‌ను భరించలేం..!

లాక్‌డౌన్‌ను భరించలేం..!

వాషింగ్టన్‌: కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి విధించిన లాక్‌డౌన్‌ను తాము భరించలేమని, వెంటనే ఆంక్షల్ని ఎత్తివేయాలని పలు దేశాల్లో ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలు నమోదైన అమెరికాలో సైతం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. స్వయానా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నిరసనలను ప్రోత్సహిస్తున్నారు. ఫ్రాన్స్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్‌, కెన్యా, మలావి, నైజర్‌, రష్యా, జర్మనీ, లెబనాన్‌ వంటి దేశాల్లోనూ ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రజలు ఆందోళనబాట పట్టారు. అమెరికాలో కొవిడ్‌-19 మృతుల సంఖ్య అరకోటి దాటినా.. లాక్‌డౌన్‌ను ఉపసంహరించేందుకు కొన్ని రాష్ర్టాలు తెరలేపాయి. సౌత్‌ కరోలినా, జార్జియా, ఓక్లహామా, అలస్కా రాష్ర్టాల్లో లాక్‌డౌ న్‌ను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవై పు, ఆంక్షల్ని లెక్కచేయకుండా కాలిఫోర్నియాలో శనివారం వందల మంది బీచ్‌లకు పోటెత్తారు.


logo