శనివారం 08 ఆగస్టు 2020
International - Jul 04, 2020 , 11:18:43

చైనాపై నిర‌స‌న‌.. హాంగ్‌కాంగ్‌తో కెన‌డా ఒప్పందం ర‌ద్దు

చైనాపై నిర‌స‌న‌.. హాంగ్‌కాంగ్‌తో కెన‌డా ఒప్పందం ర‌ద్దు

హైద‌రాబాద్‌:  హాంగ్‌కాంగ్‌తో ఉన్న నేర‌స్థుల అప్ప‌గింత ఒప్పందాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు కెన‌డా వెల్ల‌డించింది.  హాంగ్‌కాంగ్‌పై చైనా జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టాన్ని అమ‌లు చేస్తున్న నేప‌థ్యంలో.. దానికి నిర‌స‌న‌గా కెన‌డా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది.  హాంగ్‌కాంగ్‌కు మిలిట‌రీ వ‌స్తువుల స‌ర‌ఫ‌రాను కూడా నిలిపివేస్తున్న‌ట్లు కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిస్ ట్రూడో తెలిపారు.  ట్రావెల్ అడ్వైజ‌రీలోనూ మార్పు చేస్తున్న‌ట్లు కెన‌డా విదేశాంగ శాఖ వెల్ల‌డించింది.  ఒక దేశం, రెండు వ్య‌వ‌స్థ సిద్ధాంతాన్ని కెన‌డా న‌మ్ముతుంద‌ని ట్రూడో తెలిపారు. కానీ ప్ర‌స్తుతం హాంగ్‌కాంగ్‌లో ఉన్న ప‌రిస్థితి తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ద‌ని ఆయ‌న అన్నారు.  హాంగ్‌కాంగ్‌లో సుమారు మూడు ల‌క్ష‌ల మంది కెన‌డీయులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌మ దేశ ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ కోసం హాంగ్‌కాంగ్‌తో గ‌తంలో కుదుర్చుకున్న ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు కెన‌డా స్ప‌ష్టం చేసింది. హాంగ్‌కాంగ్‌లో ఎవ‌రూ దేశ వ్య‌తిరేక క‌లాపాల‌కు పాల్ప‌డినా.. వారిని చైనా రూపొందించిన కొత్త చ‌ట్టం ప్ర‌కారం శిక్షించ‌నున్నారు.  దీన్ని కామ‌న్వెల్త్ దేశాలు వ్య‌తిరేకిస్తున్నాయి.  


logo