బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Sep 12, 2020 , 20:42:13

కెన‌డాలో గ‌త 5 నెల‌ల్లో తొలిసారి జీరో మ‌ర‌ణాలు

కెన‌డాలో గ‌త 5 నెల‌ల్లో తొలిసారి జీరో మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హమ్మారి ప్ర‌బ‌లిన‌ప్ప‌టి నుంచి గ‌త ఐదు నెల‌ల వ్య‌వ‌ధిలో కెనడాలో తొలిసారి జీరో మరణాలు నమోదయ్యాయి. గ‌త 24 గంటల వ్యవధిలో అక్క‌డ ఒక్క మ‌ర‌ణం కూడా న‌మోదు కాలేదు. మార్చి 15 నుంచి ఇప్ప‌టివ‌రకు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో ఒక్క మ‌ర‌ణం కూడా చోటుచేసుకోక‌పోవ‌డం ఇదే తొలిసారని పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ డేటాను బట్టి తెలుస్తున్న‌ది. ఈ నెల 11 నాటికి కెనడాలో 9,163 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇక 11న 702 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,35,626కు పెరిగింది.

కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇటీవల కెనడాలోని పలు ప్రావిన్స్‌లలో లాక్‌డౌన్ నిబంధనలను సడలించారు. పాఠశాలలు కూడా తెరిచారు. అయితే, దేశంలో ఇటీవల కేసుల వ్యాప్తి కొద్దిగా పెరిగింది. దీంతో వైరస్ మరింత చెలరేగిపోకుండా ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. బ్రిటిష్ కొలంబియా సహా పలు ప్రావిన్సులు సరికొత్త ఆంక్షలు విధించాయి. కెనడాను ఆనుకుని ఉన్న అమెరికాతో పోలిస్తే కెనడా పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 1.90 లక్షల మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. 6.38 మిలియన్ల మందికిపైగా కరోనా బారిన‌ప‌డ్డారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo