బుధవారం 27 మే 2020
International - Apr 27, 2020 , 16:49:31

కెన‌డాలో లాక్‌డౌన్ పాక్షిక స‌డ‌లింపు

కెన‌డాలో లాక్‌డౌన్ పాక్షిక స‌డ‌లింపు

కెన‌డాలో క‌రోనా కార‌ణంగా విధించిన లాక్‌డౌన్‌ను ప్ర‌భుత్వం క్ర‌మంగా స‌డ‌లిస్తున్న‌ది. దేశంలో కోవిడ్‌-19 కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు 2500 మంది మ‌ర‌ణించారు. పాజిటివ్ కేసులు 46848కి చేరాయి. అయితే దేశంలో క‌రోనా కేసులు కొన్ని రాష్ట్రాల్లోనే ఎక్కువ‌గా న‌మోద‌య్యాయి. దాంతో క‌రోనా కేసులు లేని రాష్ట్రాల్లో వ్యాపారాలు ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఒంటారియో, క్యుబెక్, స‌స్కాచువాన్‌, న్యూ బ్ర‌న్స్‌విక్‌, ప్రిన్స్ ఎడ్వార్డ్ ద్వీపం త‌దిత‌ర ప్రాంతాల్లో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొల్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


logo