మంగళవారం 27 అక్టోబర్ 2020
International - Oct 05, 2020 , 11:20:43

బుల్లెట్ ట్రైన్ స్పీడ్.. వెళ్లిన‌ట్టు కూడా తెలియ‌దు!

బుల్లెట్ ట్రైన్ స్పీడ్.. వెళ్లిన‌ట్టు కూడా తెలియ‌దు!

సాధార‌ణంగా రైలు 100 కి.మీ. వేగంతో వెళ్తుంటేనే భ‌య‌మేస్తుంది. అలాంటిది 300 కి.మీ. స్పీడ్‌తో వెళ్తే.. ఇంకేమైనా ఉందా! గుండెపోటు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. కానీ ఈ బుల్లెట్ ట్రైన్ మాత్రం 300 నుంచి 400 కి.మీ. వేగంతో దూసుకెళ్తున్న‌ది. అంత‌ స్పీడ్‌తో వ‌స్తున్న ట్రైన్‌ను చూస్తున్న‌ప్ప‌టికీ క‌ళ్ల‌కు క‌నిపించిన అనుభూతి మాత్రం క‌ల‌గ‌డం లేదు. అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయింది అనిపిస్తుందే గాని ట్రైన్ వ‌చ్చింద‌ని అస‌లు అర్థం కాదు. అంత స్పీడ్‌తో వెళ్లింది ట్రైన్‌. అయితే ఈ బుల్లెట్ ట్రైన్ ఇక్క‌డిది కాదు జ‌పాన్‌కు చెందిన ఓ రైల్వేస్టేష‌న్‌లో చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అయింది. ఒక‌సారి ఈ వీడియో చూస్తే అస‌లు విష‌యం అర్థ‌మ‌వుతుంది. 


logo