సోమవారం 13 జూలై 2020
International - Jun 16, 2020 , 16:37:45

ఈ ఫొటోలో జంతువేంటో గుర్తుపట్టగలరా..?

ఈ ఫొటోలో జంతువేంటో గుర్తుపట్టగలరా..?

అటవీ ప్రాంతంలో పొడవాటి చెట్టు దుంగ ఒకటి ఉంది. చెక్కపై అక్కడకక్కడా పగుళ్లతోపాటు చిన్నచిన్న రంధ్రాలు కూడా ఉన్నాయి. దాని కింద కాలివేళ్లలాంటివి  బయటకు కనిపిస్తున్నాయి. అవి చూడటానికి ఐదు కాలివేళ్లు, గోర్లలాగే కనిపిస్తున్నాయి. ఈ ఫొటోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుసంతా నందా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఫొటోలో కాస్త వింతగా కనిపిస్తున్న ఈ జంతువు ఏంటో చెప్పండి అని..ట్వీట్‌ చేశారు. దీనికి ఓ నెటిజన్‌ స్పందిస్తూ అవి చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాయి. నా మెమోరీలోంచి దాన్ని తీసేస్తానని కామెంట్‌ పెట్టాడు.

మరోవ్యక్తి అసలు అదేంటో చెప్పడానికి ప్రయత్నించాడు. లంగూర్‌, చింపాంజీ, గొరిలా కాళ్లని చెప్పుకొచ్చాడు. మరి ఈ మూడింటిలో ఏదీ కరెక్ట్‌ కాదు. ఇంతకీ సరైన సమాధానమేంటనేదే కదా మీ డౌట్‌. అదేంటో తెలుసుకోవాలని ఎక్సయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ఫాలోవర్లకు సమాధానమిచ్చారు. అది ఒక శిలీంద్రమని (ఫంగస్‌)అని సుసంతా నందా చెప్పారు. ఈ ఫంగస్‌ ను సాధారణంగా డెడ్‌మ్యాన్‌ ఫింగర్స్‌గా పిలుస్తుంటారు. దీని శాస్త్రీయ నామం జైలేరియా పాలీమార్ఫా. రెండు నుంచి ఐదు వరకు శాఖలుగా విస్తరిస్తుంటాయి. చనిపోయిన వ్యక్తి కాళ్లలాగా కనిపిస్తుండటంతో వీటిని డెడ్ మ్యాన్స్ ఫింగర్స్ అని అంటారు. logo