శనివారం 06 జూన్ 2020
International - May 01, 2020 , 12:28:19

ఆ ఉగ్ర‌వాదుల‌ను క‌నిపెట్ట‌లేంః ఇమ్రాన్ ఖాన్‌

ఆ ఉగ్ర‌వాదుల‌ను క‌నిపెట్ట‌లేంః ఇమ్రాన్ ఖాన్‌

ఉగ్ర‌వాదులకు స్వ‌ర్గ‌ధామం అన్న పేరును చెరిపేసుకొనేందుకు పాకిస్థాన్ అన్నివిధాలా ప‌ర్య‌టిస్తున్న‌ది. భార‌త్ ఒత్తిడితో పాకిస్థాన్‌ను అంత‌ర్జాతీయంగా ఉగ్ర‌వాద దేశం అని చాలా దేశాలు నిందించ‌టంతో ఐక్య‌రాజ్య‌స‌మితి కూడా ఆ దేశంలోని ఉగ్ర‌మూక‌ల కార్య‌క‌లాపాల‌పై దృష్టిపెట్టింది. ఇటీవ‌ల ఐక్య‌రాజ్య స‌మితి సెక్యూటీ కౌన్సిల్ (యూఎన్ఎస్సీ)  బృందం పాకిస్థాన్‌లో ప‌ర్య‌టించింది. అంత‌కుముందే ఇమ్రాన్‌ఖాన్ ప్ర‌భుత్వం దాదాపు 4000 మంది ఉగ్ర‌వాదుల‌ను వాచ్‌లిస్ట్ నుంచి తొల‌గించింది. వారు ఎక్కడున్నారో తెలియ‌ద‌ని వాదించింది.

ఇస్లామాబాద్‌కు వ‌చ్చిన యూఎస్సీ బృందం 130 మంది క‌రుడుగ‌ట్టిన ఉగ్రవాదుల‌పై 1267 ర‌కాల ఆంక్ష‌ల‌ను అమ‌లుచేయాల‌ని పాకిస్థాన్ ప్ర‌భుత్వాన్ని కోరింది. అయితే వారితో పాకిస్థాన్ ఎప్పుడూ చెప్పే మాటే చెప్పింది. ఆయా వ్య‌క్తులు ఉగ్ర‌వాదులు అనేందుకు స‌రైన ఆధారాలు మీరు ఇవ్వ‌లేదు అని తేల్చేసింది. 2013లోనే ఐరాసా  అంత‌ర్జాతీయ ఉగ్రవాదిగా ప్రక‌టించిన ల‌ష్క‌ర్ ఇ జాంఘ్వి అధినేత మ‌తియుర్ రెహెమాన్ ను ఉగ్ర‌వాద జాబితా నుంచి తొల‌గించాల‌ని ఐరాస బృందాన్నేకోరింది. ఐరాస బృందం త‌యారు చేసిన లిస్టులో ఉన్న ఉగ్ర‌వాదుల‌కు సంబంధించిన పుట్టిన‌రోజు, జాతీయ‌త‌, గుర్తింపుకార్డులు, పాస్‌పోర్టు నంబ‌ర్లు, క‌చ్చిత‌మైన చిరునామాలు లేవు. సాధార‌ణంగానే ఉగ్ర‌వాదులు వారి వ్య‌క్తిగ‌త వివ‌రాలు ఎవ‌రికీ తెలియ‌కుండా ధ్వంసం చేస్తారు. అలాంటప్పుడు పాకిస్థాన్ కోరుతున్న‌ట్లు క‌చ్చిత‌మైన వివ‌రాలు సంపాదించ‌టం సాధ్యం కాదు. ఈ లోపాన్నే ఉప‌యోగించుకొని పాకిస్థాన్ త‌మ దేశంలో ఉగ్ర‌వాదులు లేర‌ని, ఎక్క‌డ ఉన్నారో తెలియ‌ద‌ని వాదిస్తున్న‌ది. logo