గురువారం 28 మే 2020
International - May 20, 2020 , 19:35:27

ఈ ఏడాదంతా పాఠాలు చెప్పమంతే..

ఈ ఏడాదంతా పాఠాలు చెప్పమంతే..

లండన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా  విద్యాసంస్థలు మూతపడ్డాయి. దాంతో పలు యూనివర్సిటీలు ఆన్‌లైన్‌ టీచింగ్‌ చేపట్టి విద్యాసంవత్సరం పూర్తయ్యేందుకు కృషిచేస్తుండగా.. ప్రతిష్ఠాత్మక కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం వచ్చే విద్యాసంవత్సరంలో కూడా తరగతులు నిర్వహించమని ఘంటాపధంగా చెప్తోంది. బ్రిటన్‌లో తరగతులను రద్దు చేసిన విశ్వవిద్యాలయంగా కేంబ్రిడ్జి యూనివర్సిటీ నిలిచింది. ముఖాముఖి తరగతులు కాకుండా వర్చువల్‌, ఆన్‌లైన్‌ తరగతులు మాత్రమే నిర్వహిస్తామని ఆ వర్సిటీ అధికారులు స్పష్టంచేశారు. 

కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో కొత్త విద్యాసంవత్సరం అక్టోబర్‌లో మొదలవుతుంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తిలో ఉన్నందున విద్యార్థులకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం  తీసుకొన్నట్టు తెలుస్తుంది. కరోనా వైరస్‌ ప్రభావం తగ్గిన తర్వాత చిన్నచిన్న సమూహాలతో బోధన కొనసాగించేలా, భౌతిక దూరం  పాటించేలా ఏర్పాట్లు చేస్తామంటున్నారు. కరోనా వైరస్‌ ఇప్పటికే విద్యార్థి జీవితాలను నాశనం చేసింది. దాంతో మార్చి నెల నుంచే ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా, పరీక్షలను రిమోట్‌గా నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


logo