అమెరికాలో కరోనా వేరియంట్ రెండో కేసు నమోదు

కాలిఫోర్నియా : బ్రిటన్‌లో వెలుగుచూసిన కరోనా వైరస్ వేరియంట్ కొత్త కేసులు ఇప్పుడు అమెరికాలో కూడా బయటపడుతున్నాయి. కాలిఫోర్నియా నగరంలో రెండో కేసును నమోదైంది. ఈ విసయాన్ని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హెడ్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీతో ఆన్లైన్ సంభాషణలో దక్షిణ కాలిఫోర్నియాలో దొరికిన ఇన్ఫెక్షన్ను ప్రభుత్వం ప్రకటించింది. కాలిఫోర్నియా ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. అయితే, వేరియంట్ సోకిన వ్యక్తికి సంబంధించిన సమాచారమేదీ అధికారులు ప్రకటించలేదు.
అమెరికాలో కరోనా వేరియంట్ తొలి కేసు మంగళవారం కొలరాడోలో బయటపడింది. 24 గంటల తర్వాత కాలిఫోర్నియాలో నమోదైనట్లు ప్రకటన వచ్చింది. తొలి కేసుగా నమోదైన వ్యక్తిని కొలరాడో నేషనల్ గార్డ్స్మన్గా గుర్తించారు. అతను స్థానిక ఒక నర్సింగ్ హోమ్‌లో సహాయం చేసే నిమిత్తం పంపించడంతో మ్యుటేషన్‌కు గురైనట్లు గుర్తించారు. ఆయనతో కలిసి పనిచేసిన మరో గార్డ్ సభ్యుడు కూడా వేరియంట్‌ను కలిగి ఉండవచ్చని ఆరోగ్య అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులు ఇంగ్లండ్‌లో చెలామణి అవుతున్న సమయంలో అమెరికాకు ఎలా వ్యాప్తి చెందాయో అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని నిలువరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. చాలా ఆలస్యమైందనే భయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ వ్యాపించిందో కచ్చితంగా చెప్పలేమని అధికారులు అంటున్నారు. డెన్వర్ వెలుపల 90 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామీణ ప్రాంతంలో సిమ్లా అనే చిన్న పట్టణంలోని గుడ్ సమారిటన్ సొసైటీ నర్సింగ్ హోంలో పనిచేయడానికి ఇద్దరు గార్డ్ సభ్యులను డిసెంబర్ 23 న పంపించారని రాష్ట్ర ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ రాచెల్ హెర్లిహి తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత ఇంటికి పంపిన ఆరుగురు గార్డ్ సభ్యులలో కొత్త వేరియంట్ సోకిన వ్యక్తి కూడా ఉన్నారు. సాధారణ కరోనావైరస్ పరీక్షలో భాగంగా ఇద్దరు గార్డ్స్ నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల నిమిత్తం రాష్ట్ర ప్రయోగశాలకు పంపారు. తొలి కేసు నమోదైన వ్యక్తి తేలికపాటి లక్షణాలను కలిగి ఉండి.. డెన్వర్ సమీపంలోని తన ఇంటి వద్ద ఒంటరిగా ఉంటున్నాడు. అనుమానాస్పద కేసుగా ఉన్న మరో వ్యక్తి కొలరాడో హోటల్లో ఒంటరిగా ఉంటున్నాడుజ అతని నమూనాపై మరింత జన్యు విశ్లేషణ జరుగుతుందని అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే
తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- నదీయాత్రలో పుస్తక పఠనం.. కోల్‌కతాలో తొలి బోటు లైబ్రెరీ
- ప్రతి మహిళా పోలీస్ ఒక స్టార్: నటి అనుష్క
- కొవిడ్-19 : మేజికల్ స్ప్రేపై పరీక్షలు
- లిప్‌లాక్ సీన్ కు లావణ్యత్రిపాఠి ఒకే..?
- ఇకపై ప్రతి నెలా టెస్ట్ క్రికెట్లో బెస్ట్ ప్లేయర్ అవార్డు
- ఎర్రకోటపై దాడి.. రైతులను రెచ్చగొట్టింది ఇతడేనా?
- పూజాహెగ్డే డిమాండ్..మేకర్స్ గ్రీన్ సిగ్నల్..!
- ఇండియాలో ఉద్యోగులను తొలగిస్తున్న టిక్‌టాక్
- కారు, లారీ ఢీ.. ఐదుగురు దుర్మరణం
- చరిత్రలో ఈ రోజు.. కరెంటు బుగ్గకు పేటెంట్ దక్కిందీరోజే..