బుధవారం 27 జనవరి 2021
International - Dec 30, 2020 , 19:09:50

ఫైజ‌ర్ టీకా తీసుకున్నా.. న‌ర్సుకు పాజిటివ్‌

ఫైజ‌ర్ టీకా తీసుకున్నా.. న‌ర్సుకు పాజిటివ్‌

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో 45 ఏళ్ల న‌ర్సు ఫైజ‌ర్ వ్యాక్సిన్ చేయించుకున్న వారం త‌ర్వాత క‌రోనా బారిన ప‌డ్డారు. మాథ్యూ డ‌బ్ల్యూ అనే న‌ర్సు రెండు స్థానిక ద‌వాఖాన‌ల్లో ప‌ని చేస్తారు. ఈ నెల 18న ఫైజ‌ర్ వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత త‌న భుజ‌మంతా నొప్పిగా ఉండ‌టం మిన‌హా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్‌లు లేవ‌న్నారు.

ఆ త‌ర్వాత ఆరు రోజుల‌కు  క్రిస్మ‌స్ పండుగ‌నాడే కొవిడ్‌-19 వార్డులో ప‌ని చేశాక అనారోగ్యానికి గురైన‌ట్లు ఆయ‌న త‌న ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు. దీంతో తాను క్రిస్మ‌స్ మ‌రునాడు క‌రోనా టెస్ట్ చేయించుకోవ‌డంతో పాజిటివ్ అని వచ్చింద‌న్నాడు. శాండియాగో ఫ్యామిలీ హెల్త్ సెంట‌ర్‌లో ఇన్‌ఫెక్షియ‌స్ డిసీజ్ స్పెష‌లిస్టు చిరిస్టియ‌న్ రామ‌ర్స్ మాట్లాడుతూ ఇటువంటి ప‌రిస్థితి వ‌స్తుంద‌ని ఊహించ‌లేద‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo