ఆదివారం 31 మే 2020
International - May 21, 2020 , 16:07:02

పిల్లితో పెళ్లి.. దీనికో కారణముందోచ్‌..

పిల్లితో పెళ్లి.. దీనికో కారణముందోచ్‌..

కాలిఫోర్నియా: నలుపు, తెలుపు డ్రెస్‌లో హుందాగా నడుచుకొంటూ వచ్చాడు పెండ్లికొడుకు. ఆశీర్వాదాలు అందించేందుకు పెద్దవాళ్లు కూడా వర్చువల్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌లో సిద్ధంగా ఉన్నారు. పెండ్లి తంతు నిర్వహించేందుకు చర్చి నిర్వహాకులు ఎదురుచూస్తున్నారు. ఇంతలో.. గెంతుకొంటూ వచ్చిందో పిల్లి. అందమైన తెల్లటి లాంగ్‌ఫ్రాక్‌ వేసుకొని నడుముకు పూలతో అల్లిన వడ్డాణంలాంటిది ధరించి వయ్యారంగా నడుస్తూ వస్తున్న ఆ మార్జాలాన్ని చూసి అక్కడికొచ్చిన ఆహుతులంతా ఆశ్యర్యంతో కల్లెగరేశారు. 

ఇంతకీ ఈ పెండ్లి ఎవరిదంటే.. కాలిఫోర్నియాకు చెందిన స్కాట్‌ పెర్రీ అనే పెద్దాయనది. పెండ్లికూతురు మాత్రం ఆయన అల్లారుముద్దుగా పెంచుకొంటున్న పిల్లి. పెండ్లేంటి.. పిల్లేంటి.. అని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి. ఓ రోజు నేను నడుస్తూ వస్తుండగా అనాథలా ఈ పిల్లి కనిపించింది. తొలిచూపులోనే మేం ప్రేమలో పడ్డాం. అయితే నా ప్రియురాలుకు నా అనే వాళ్లు లేకపోవడం, ఉండేందుకు ఇల్లు లేకపోవడంతో.. నాతో తెచ్చుకొని పెంచుకొంటున్నా.. ఈ రోజు నా ప్రియురాలు మార్జాలాన్ని పెండ్లి చేసుకొంటున్నా. ఇలాంటి గూడు లేని మూగజీవాలకు అండగా నిలిచేందుకు నిధుల సమీకరణ కోసం మార్జాలాన్ని పెండ్లి చేసుకోవాలనుకొంటున్నా.. మీరూ చేయూతనిచ్చి మూగజీవాలను ఆదుకోవాలని కోరుతున్నా.. అని ట్విట్టర్‌లో తన పెండ్లి కథాకమామిషును చెప్పుకొచ్చాడు స్కాట్‌ ఫెర్రీ.


logo