మంగళవారం 02 మార్చి 2021
International - Jan 18, 2021 , 15:10:38

క‌రోనా భ‌యం.. 3 నెల‌లుగా ఎయిర్‌పోర్ట్‌లో దాక్కున్న వ్య‌క్తి

క‌రోనా భ‌యం.. 3 నెల‌లుగా ఎయిర్‌పోర్ట్‌లో దాక్కున్న వ్య‌క్తి

చికాగో:  అమెరికాలోని చికాగో విమానాశ్ర‌యంలో ఆదిత్య సింగ్ అనే వ్య‌క్తి మూడు నెల‌లుగా త‌ల‌దాచుకుంటున్నాడు.  క‌రోనా భ‌యంతో అత‌ను ఎయిర్‌పోర్ట్ విడిచి వెళ్ల‌లేదు.  విమానాశ్ర‌యంలోని నిషేధిత ప్రాంతంలో ఉంటున్న అత‌న్ని గ‌త వార‌మే పోలీసులు అరెస్టు చేశారు.  కాలిఫోర్నియాకు చెందిన ఆదిత్య సింగ్‌.. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 19వ తేదీ చికాగోలోని ఓ-హేర్ విమానాశ్ర‌యం చేరుకున్నాడు. అయితే 36 ఏళ్ల ఆదిత్య సింగ్.. ఆ ఎయిర్‌పోర్ట్‌లోనే న‌కిలీ ఐడీతో ఓ ఉద్యోగిలా ఉండిపోయాడు.  క‌రోనా వైర‌స్ సోకుతుంద‌న్న భ‌యంతో అత‌ను తిరిగి లాస్ ఏంజిల్స్‌కు వెళ్ల‌లేదు.  జ‌న‌వ‌రి 16వ తేదీ పోలీసులు ఆదిత్య సింగ్‌ను అరెస్టు చేశారు.  మూడు నెల‌లుగా ఓ వ్య‌క్తి ఎయిర్‌పోర్ట్‌లో నివ‌సిస్తుంటే మీరేమి చేస్తున్నార‌ని చికాగో కౌంటీ జ‌డ్జి సుసానా ఆర్టిజ్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఉద్యోగులు 911కు ఫోన్ చేసి ప‌ట్టించారు.  హాస్పిటాలిటీలో అత‌నికి మాస్ట‌ర్స్ డిగ్రీ ఉన్న‌ది.   లాస్ ఏంజిల్స్‌లో అత‌ను రూమ్‌మేట్స్‌తో ఉంటున్నాడు. వెయ్యి డాల‌ర్ల‌కు అత‌నికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీక‌రించింది.  

VIDEOS

logo