సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 02, 2020 , 21:18:49

ద్వీపాల ఆకృతిలో కేకులు..సోషల్‌ మీడియాలో వైరల్‌!

ద్వీపాల ఆకృతిలో కేకులు..సోషల్‌ మీడియాలో వైరల్‌!

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో చాలామందికి సమయం చిక్కింది. దీంతో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆహారానికి సంబంధించి సరికొత్త వంటకాలు తయారుచేస్తూ సోషల్‌మీడియాలో పెడుతున్నారు. ఇందులో కొన్ని భయానక వంటకాలు కూడా ఉన్నాయి. . రాహుల్ పాసి అనే వ్యక్తి మ్యాగీ, చాక్లెట్‌ను కలిపి మ్యాగీచాక్లెట్‌ వంటకాన్ని తయారుచేసి, నెటిజన్లను భయపెట్టాడు. అలాగే, అముల్‌ కంపెనీ అల్లం, తులసి (బాసిల్), హల్ది (పసుపు) లాంటి రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలతో తయారు చేసిన హల్దీ ఐస్‌క్రీంకు మిశ్రమ స్పందనే వచ్చింది.   

ఇప్పుడు ఇదే తరహాలో విదేశాల్లో ట్రాపికల్‌ ఐలాండ్స్‌(ఉష్ణమండల ద్వీపాలు) ఆకృతిలో తయారు చేసిన కేకులు హల్‌చల్‌ చేస్తున్నాయి. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన అక్కడి ప్రజలు, తమకిష్టమైన ఐలాండ్‌ ఆకృతి కేకులను తయారు చేయించుకొని, వాటిని తింటూ ఆ ప్రదేశానికి వెళ్లినట్లు అనుభూతిపొందుతున్నారట. దీంతో ఈ జెల్లీ కేకులకు భారీ డిమాండ్‌ వచ్చింది. వీటి ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo