ఓ భయంకరమైన ఘటన.. దగ్ధమవుతున్న కారులో ఇద్దరు వృద్ధ దంపతులు.. వారు ఆ మంటలకు మాడి మసై పోతారేమోనని అనుకునే క్షణాలు.. కానీ ఓ ఇద్దరు మాత్రం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి.. ఆ వృద్ధ దంపతులను సురక్షితంగా కాపాడారు.
కాలిఫోర్నియాలో వేగంగా వెళ్తున్న కారు వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న వృద్ధ దంపతులు ఆ వాహనాన్ని సడెన్గా ఆపేశారు. అప్పటికే తీవ్ర భయాందోళనకు గురైన వారిద్దరూ బయటకు వచ్చే ప్రయత్నం చేయలేదు. ఆ దారి గుండా వెళ్తున్న మరో ఇద్దరు వ్యక్తులు ఆ కారులో ఉన్న వృద్ధులను రక్షించేందుకు ప్రయత్నించారు. ఎగిసిపడుతున్న మంటలను సైతం లెక్క చేయకుండా.. కారు దగ్గరికి వెళ్లి.. అందులో ఉన్న ఇద్దర్నీ సురక్షితంగా బయటకు లాగారు. దీంతో ఆ వృద్ధ దంపతులు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వృద్ధ దంపతులను కాపాడిన ఆ ఇద్దరు హీరోలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.